రిలీజ్ కు ముందే రాజా సాబ్ రికార్డ్.. ప్రభాస్ కోసం ఇండియాలో మొదటిసారిగా

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతీ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'ది రాజా సాబ్'. ఈ సినిమా కోసం అభిమానులతో పాటు నార్మల్ ఆడియెన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. దాంతో సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడెప్పు వస్తాయా? అని వెయింట్ చేస్తూ ఉన్నారు. ఇక రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన బ్యూటీఫుల్ టీజర్ విడుదలై ఆకట్టుకుంది. దాంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇప్పటికీ టీజర్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుండటం విశేషం. కాగా తాజాగా ప్రభాస్ ది రాజా సాబ్ చిత్రం గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..

ది రాజా సాబ్ బడ్జెట్ ఎంత?
మారుతీ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి భారీ ఖర్చైంది. తొలుత ఈ చిత్రానికి అనుకున్న బడ్జెట్ కంటే మరింత ఎక్కువగానే అయ్యింది. కారణం ఈ చిత్రంలోని విజువల్ ఎఫెక్ట్స్, సీజీ వర్క్, భారీ సెట్ లు, భారీ తారాగణం, టాప్ టెక్నీషియన్లు పనిచేయడం మూలంగా బాగానే ఖర్చైందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. పీపుల్స్ మీడియా బ్యానర్ లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి రూ.450 కోట్ల వరకు బడ్జెట్ ఖర్చైందని తెలుస్తోంది. టీజీ విశ్వ ప్రసాద్ ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా గ్రాండ్ అవుట్ పుట్ కోసం ఎదురుచూస్తున్నారని తెలుస్తోంది.

Prabhas The RajaSaab movie Create new Record with Built Indias Large Indoor Horror Set

ది రాజా సాబ్ క్రియేట్ చేసిన రికార్డు ఇదే?
తొలిసారిగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హారర్ర్ కామెడీ ఫిల్మ్ లో నటించబోతున్నారు. పైగా ఈ చిత్రంలో ప్రభాస్ ఆయన కెరియర్ లో మొదటి సారిగా ద్విపాత్రాభినయం చేస్తుండటం విశేషం. అటుపైన ఈ చిత్రానికి మారుతీ దర్శకత్వం వహించడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకున్నాయి. కానీ ఈ సినిమా రిలీజ్ కు ముందే ఓ రికార్డును కూడా క్రియేట్ చేయడం ఆసక్తికరంగా మారింది. టీజర్ లో చూపించిన రాజా సాబ్ ప్యాలెస్ ను నిర్మించేందుకు మేకర్స్ భారీగానే ఖర్చు చేశారంట.

రూ.25 కోట్లతో..
ఈ సెట్ నిర్మాణంతో ఇండియాస్ బిగ్గెస్ట్ లార్జెస్ట్ సెట్ నిర్మించిన చిత్రంగా రాజా సాబ్ రికార్డు క్రియేట్ చేసింది. హైదరాబాద్ లోని అజీజ్ నగర్ లో 41,256 స్క్వేర్ ఫీట్ల విశాలమైన ప్రదేశంలో ఈ సెట్ నిర్మించారు. అలాగే ఈ సెట్ తో పాటు అల్యూమినియం ఫ్యాక్టరీ లో మరో సెట్ ను కూడా నిర్మించారు. ఇలా రెండు సెట్స్ కు సంబంధించి నిర్మాతలు రూ.25 కోట్ల వరకు ఖర్చు చేశారని తెలుస్తోంది. ఏదేమైనా రాజాసాబ్ చిత్రం పూర్తి బడ్జెట్ లో ఈ సెట్స్ కే భారీగా ఖర్చు చేశారని అంటున్నారు.

దుమ్ములేపుతున్న టీజర్..
జూన్ 16న విడుదల చేసిన రాజా సాబ్ టీజర్ యూట్యూబ్ లో దుమ్ములేపుతోంది. ఇప్పటి వరకు 6 రోజుల్లో అన్ని భాషల్లో కలిపి 50 మిలియన్ల వరకూ వ్యూస్ ను దక్కించుకోవడం విశేషం. మరోవైపు టీజర్ లోని ప్రభాస్ వింటేజ్ అండ్ స్టైలిష్ లుక్, విజువల్స్, బీజీఎం, కథపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే మూమెంట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా, బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. 2025 డిసెంబర్ 5న ఈ చిత్రం విడుదల కాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X