ఒకేసారి రెండు సినిమాలతో ప్రభాస్ రచ్చ: కరోనా వల్ల అతడు ఇలా లాభపడ్డాడు

దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన 'బాహుబలి' సిరీస్ తర్వాత యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగిపోయిందన్న విషయాన్ని ప్రత్యేకంగ చెప్పనక్కర్లేదు. దీని తర్వాతనే అతడు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఒకటి షూటింగ్ జరుగుతుండగానే.. మరిన్ని చిత్రాలను లైన్‌లో పెట్టుకుంటూ సత్తా చాటుతున్నాడు. అది కూడా అన్నీ పాన్ ఇండియా ప్రాజెక్టులే కావడం విశేషం. ఇక, ప్రస్తుతం ప్రభాస్.. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో 'రాధే శ్యామ్' అనే సినిమాలో నటిస్తున్నాడు. దానితో పాటు మరో రెండు చిత్రాలనూ పట్టాలెక్కించేశాడు.

ప్రభాస్ నటిస్తోన్న చిత్రాల్లో 'ఆదిపురుష్' ఒకటి. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రూపొందిస్తోన్న ఈ సినిమాతో అతడు హిందీ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. రామాయణం నాటి కథతో రాబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడిగానూ.. కృతి సనన్ సీతగా నటిస్తున్నారు. అలాగే, బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా.. సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రను చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొన్నటి వరకూ ముంబైలో జరిగింది. ఇక, కొద్ది రోజుల్లో ఈ మూవీ యూనిట్ హైదరాబాద్ రాబోతుంది. అక్కడే దాదాపు వంద రోజుల పాటు షూటింగ్ జరపనున్నారు.

Prabhas to do Salaar and Adipurush in One Time

ప్రస్తుతం ముంబైలో నెలకొన్న కరోనా పరిస్థితుల కారణంగానే 'ఆదిపురుష్' షూటింగ్‌ను హైదరాబాద్‌కు షిప్ట్ చేశారు. ఇదే యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌కు బాగా కలిసొచ్చింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో అతడు నటిస్తోన్న 'సలార్' మూవీ షూటింగ్ కూడా హైదరాబాద్‌లోనే జరగనుంది. సో.. ఒకే సమయంలో ఈ రెండు చిత్రాల షూటింగ్‌లలో పాల్గొనబోతున్నాడీ పాన్ ఇండియా స్టార్ హీరో. వాస్తవానికి 'సలార్' మూవీ షూటింగ్ గుజరాత్‌లో చిత్రీకరణ జరుపుకోవాల్సి ఉన్నా.. ముందుగా హైదరాబాద్ షెడ్యూల్‌నే పూర్తి చేయబోతున్నారని ఓ న్యూస్ బయటకు వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X