ప్రభాస్ చేతుల మీదుగా నువ్వు తోపురా ట్రైలర్.. ఎప్పుడంటే
దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రం ద్వారా పరిచయమైన హీరో సుధాకర్ కోమాకుల తాజాగా నువ్వు తోపురా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. యునైటెడ్ ఫిలిమ్స్ పతాకంపై డీ శ్రీకాంత్ ఈ సినిమాను రూపొందించారు. హరనాథ్ బాబు ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో నిత్యాశెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు.
ఇక 90 దశకాల్లో యువతను ఆకట్టుకొన్న హీరోయిన్ నిరోషా ఈ సినిమా ద్వారా సెకండ్ ఇన్సింగ్ మొదలు పెట్టనున్నారు. సావిత్రి అనే ఓ కీలకమైన పాత్రలో కనిపిస్తారని చిత్ర యూనిట్ వెల్లడించింది.

ఇలాంటి ప్రత్యేకతలు ఉన్న చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. అలాగే సుధాకర్ గెటప్స్ ఆకట్టుకొనేలా ఉన్నాయి. ఇక సినిమా ప్రమోషనల్ కార్యక్రమాల్లో భాగంగా థియేట్రికల్ ట్రైలర్‌ను మంగళవారం (ఏప్రిల్ 23)న 11.30 గంటలకు విడుదల చేయనున్నారు.

నువ్వు తోపురా సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ చేతులు మీదుగా రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ వెల్లడించింది. ప్రభాస్ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ కావడం ఈ సినిమాపై మరింత క్రేజ్ పెరగడం సహజమనే మాట వినిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











