Adipurush: ప్రభాస్ అభిమానులకు బిగ్ న్యూస్.. ఆ పుణ్యక్షేత్రంలో బిగ్ ఈవెంట్.. డేట్ ఫిక్స్!
ప్రభాస్ రాముడి పాత్రలో ఓం రౌత్ దర్శకత్వం వహించిన పౌరాణిక చిత్రం "ఆదిపురుష్" జూన్ 16న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ బిగ్ బడ్జెట్ మూవీ ప్రేక్షకులలో విపరీతమైన బజ్‌ని సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ ప్లాన్ చేయడానికి చిత్ర బృందం బలంగా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక "ఆదిపురుష్" ప్రీ-రిలీజ్ ఈవెంట్ కోసం వేదికను అలాగే తేదీని ఇప్పటికే ఖరారు చేయడంతో ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
టాక్ ప్రకారం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ జూన్ 3న నిర్వహించనున్నారు. ఇక ఈ వేడుకకు పుణ్యక్షేత్రం తిరుపతిలో వేదిక కానుంది. ఆదిపురుష్ చిత్రం ట్రైలర్‌ను మే 9న విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. ఇక అంచనాలు అయితే భారీగానే ఉన్నాయి. ఓం రౌత్ దర్శకత్వం వహించిన "ఆదిపురుష్" తప్పకుండా బిగ్ హిట్ గా నిలుస్తుందని అంటున్నారు.

రామాయణం జీవితానికి సంబంధించిన కథ, ప్రభాస్ శ్రీరాముడి ఐకానిక్ పాత్రతో పాటు కృతి సనన్ సీతగా నటించిన విధానం సినిమాలో హైలెట్ కానున్నాయి. లంకేష్‌గా సైఫ్ అలీ ఖాన్, హనుమంతుడిగా దేవ దత్తా నాగే లక్ష్మణుడిగా సన్నీ సింగ్ కనిపించబోతున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందించబడిన "ఆదిపురుష్" విజువల్స్ అద్భుతంగా ఉంటాయట. అత్యాధునిక మోషన్ క్యాప్చర్ 3D సాంకేతికతతో సినిమాను సరికొత్తగా రూపొంచారట.
ఈ ఏడాది జనవరిలో సంక్రాంతికి విడుదల చేయడానికి ప్లాన్ చేయగా టీజర్‌లో దాని VFX వలన విమర్శలను ఎదుర్కొంది. దీంతో చిత్రనిర్మాతలు అవసరమైన సర్దుబాట్లు చేయాలని నిర్ణయించుకున్నారు. విడుదలను జూన్ 16కి వాయిదా వేశారు, VFX రీవర్క్‌లలో 100 కోట్లకు పైగా అదనపు బడ్జెట్‌ను పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. ఇక "ఆదిపురుష్" తెలుగు, హిందీ అనేక ఇతర భారతీయ భాషలలో ప్రేక్షకులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకుంది.

ఇక ప్రభాస్ "ఆదిపురుష్"తో పాటు "ప్రాజెక్ట్ కె," "సలార్" సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. దర్శకుడు మారుతీతో కామెడీ హారర్ చిత్రం "రాజా డీలక్స్" కూడా లైన్ లో ఉంది. ఇక మరికొన్ని ప్రాజెక్ట్ లు కూడా చర్చల దశలో ఉన్నాయి. మరి ఈ సినిమాలతో ప్రభాస్ తన మార్కెట్ స్థాయిని ఇంకా ఏ రేంజ్ కు పెంచుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











