ఆసక్తికరంగా ఆదిపురుష్ రన్ టైమ్.. ఏకంగా అన్ని గంటలు ఉంటుందా!
పాన్ ఇండియా స్టార్‌గా మారిన తర్వాత నుంచి రాకెట్ వేగంతో ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తూ.. జెట్ స్పీడుతో దూసుకుపోతోన్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఇప్పుడు ఏకంగా నాలుగైదు సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోన్న అతడు.. ఏకంగా బాలీవుడ్‌లోనే 'ఆదిపురుష్' అనే సినిమాను చేశాడు. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే భారీ బడ్జెట్, హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో రాబోతుంది. దీంతో ఈ సినిమాపై ఆరంభం నుంచే అంచనాలు ఓ రేంజ్‌లో ఏర్పడ్డాయి.
ప్రభాస్ నటిస్తోన్న 'ఆదిపురుష్' మూవీని జూన్ 16వ తేదీన వరల్డ్ వైడ్‌గా అత్యధిక లొకేషన్‌లలో ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. దీంతో చిత్ర యూనిట్ ఒకవైపు ప్రచార కార్యక్రమాలను చేయడంతో పాటు మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను కూడా శరవేగంగా జరుపుకుంటోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఎడిటింగ్ పనులను పూర్తి చేసుకున్నారని తెలిసింది. తద్వారా ఈ సినిమా ఫైనల్ కాపీని రెడీ చేశారని బీ టౌన్ వర్గాల ద్వారా తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం.. 'ఆదిపురుష్' మూవీకి సంబంధించిన ఫస్ట్ కాపీ వివరాలు బయటకు వచ్చాయి. దీన్ని ఫైనల్‌గా 174 నిమిషాల నిడివితో కట్ చేశారట. అంటే 2 గంటల 54 నిమిషాల రన్ టైంతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలిసింది. నిజానికి దీనికి దగ్గర దగ్గర మూడు గంటల పైగానే రషెస్ వచ్చినా.. దర్శక నిర్మాతల సూచన మేరకు ఎడిటర్లు 174 నిమిషాలకే కట్ చేశారని తెలిసింది. ఇక, యాడ్స్‌తో కలిపి ఈ సినిమా మూడు గంటలు ప్రదర్శితం కాబోతుందని సమాచారం.
అత్యంత భారీ బడ్జెట్‌తో రాబోతున్న 'ఆదిపురుష్' మూవీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా, కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవదత్తా హనుమంతుడిగా నటిస్తోన్నారు. ఈ సినిమాను టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక, ఈ చిత్రాన్ని జూన్ 16వ తేదీన విడుదల చేస్తున్నారు. ఇక, ఈ చిత్రం నుంచి మే 20వ తేదీన 'జై శ్రీరామ్' అంటూ సాగే పాటను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.


Click it and Unblock the Notifications











