Don't Miss!
- News అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ: బారులు తీరిన ఓటర్లు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
Adipurush Teaser అప్డేట్ వచ్చేసింది.. ఆ రోజే మరో సర్ప్రైజ్ అంటూ దర్శకుడి క్లారిటీ!
ప్రభాస్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఆదిపురుష్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రాబోతున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే సినిమా విడుదల తేదీ పై క్లారిటీ ఇచ్చినప్పటికీ కూడా ఇంకా ఫస్ట్ లుక్ విడుదల చేయడం లేదు ఏమిటి అని అభిమానులు గత కొన్ని రోజులుగా తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక మొత్తానికి ఫస్ట్ లుక్ టీజర్ తో పాటు మరొక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్లుగా దర్శకుడు సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చాడు. ఆ వివరాల్లోకి వెళితే..
తదుపరి సినిమాలతో..
రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత మళ్ళీ బాక్స్ ఆఫీస్ వద్ద అలాంటి విజయాన్ని అందుకోలేదు. యాక్షన్ ఫిలిం గా వచ్చిన సాహో సినిమాతో పాటు రొమాంటిక్ లవ్ స్టోరీ రాదేశ్యామ్ రెండు కూడా ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయాయి. ఆ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ పెద్దగా సక్సెస్ అందుకున్నది లేదు. అందుకే తదుపరి సినిమాలతో ఎలాగైనా భారీ స్థాయిలో విజయాన్ని అందుకోవాలని ఆడియన్స్ కోరుకుంటున్నారు.
రామాయణం బ్యాక్ డ్రాప్ లో..
బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న ఆదిపురుష్ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు. ఎందుకంటే ఈ సినిమా రామాయణం బ్యాక్ డ్రాప్ లో తెరపైకి తీసుకువస్తున్నారు. రాముడి పాత్రలో ప్రభాస్ నటిస్తుండగా సీత పాత్రలో కృతి సనన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక అతి భయంకరమైన రావణాసుడడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ కనిపించబోతున్నాడు.
ఫ్యాన్స్ అసంతృప్తి
ఇక ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ విషయంలో చిత్ర యూనిట్ చాలా నెమ్మదిగా రియాక్ట్ అవుతోంది అని ముఖ్యంగా ఫస్ట్ లుక్ ఇంతవరకు విడుదల చేయకపోవడంపై అభిమానులు అయితే తీవ్రస్థాయిలో అసంతృప్తితో ఉన్నారు. గతంలో ప్రభాస్ పుట్టిన రోజున తప్పకుండా ఫస్ట్ లుక్ విడుదల చేస్తారు అని అందరూ అనుకున్నారు. కానీ అప్పుడు కూడా విడుదల చేయలేదు.
టీజర్ వచ్చేది అప్పుడే
ఇక ఫ్యాన్స్ నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిడి వస్తూ ఉండడం అలాగే విడుదల డేట్ కూడా దగ్గర పడుతూ ఉండడంతో ఎట్టకేలకు దర్శకుడు ఓం రౌత్ ఒక క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను అక్టోబర్ 2న ఉత్తరప్రదేశ్ అయోధ్యలో లాంచ్ చేయబోతున్నట్టుగా వివరణ ఇచ్చారు. దీంతో ఆ రోజు కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
మరో సర్ప్రైజ్
అలాగే అక్టోబర్ 2వ తేదీన మరొక సర్ప్రైజ్ ఇచ్చే విధంగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రభాస్ కు సంబంధించిన మరొక పవర్ఫుల్ పోస్టర్ ను కూడా విడుదల చేయబోతున్నారు. రాముడి లుక్ లో ప్రభాస్ ఎలా కనిపిస్తాడో అని ఆడియన్స్ ఎంతో ఆసక్తితో ఉన్నారు. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని నమ్మకంతో ఉన్నారు. మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుంటుందో లేదో చూడాలి.