రామాయణం బ్యాక్ డ్రాప్‌లో మరో సినిమా.. ప్రభాస్‌కు పోటీ అంటున్నారే..

సినిమా ఇండస్ట్రీలో కథలు కరువయ్యాయనే చెప్పాలి. అందుకే ఊహాజనిత కథల కంటే ఎక్కువగా నిజమైన ఘటనల ఆధారంగా కథలను క్రియేట్ చేసుకుంటున్నారు. ఇక ఇటీవల రామాయణ బ్యాక్ డ్రాప్ లో ప్రభాస్ ఒక బిగ్ బడ్జెట్ సినిమాను ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమాకు ఆదిపురుష్ అనే టైటిల్ ని కూడా సెట్ చేశారు. అయితే అదే బ్యాక్ డ్రాప్ లో బాలీవుడ్ లో ఒక స్టార్ హీరో మరో సినిమాను చేస్తున్నాడు. దీంతో ప్రభాస్ కు పోటీగా వస్తున్నారా అనే కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి.

ఆ సినిమా పనులు ఎంతవరకు వచ్చాయంటే..

ఆ సినిమా పనులు ఎంతవరకు వచ్చాయంటే..

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రావత్ మొదటిసారి ప్రభాస్ తో డైరెక్ట్ హిందీ సినిమాను చేస్తున్నాడు. ఇక ఆది పురుషస్ సినిమా పాన్ ఇండియన్ మూవీగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఏండింగ్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఒక స్పెషల్ అప్డేట్ ఇవ్వనున్నట్లు ఇప్పటికే కొన్ని రూమర్స్ వైరల్ అవుతున్నాయి.

త్వరలోనే మరో అప్డేట్

త్వరలోనే మరో అప్డేట్

ఆదిపురుష్ సినిమా రామాయణం కథగా రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. ఇక రావణుడి పాత్ర కోసం ఇప్పటికే సైఫ్ అలీ ఖాన్ ని ఫిక్స్ చేశారు. సీత పాత్రతో పాటు లక్షణ, ఆంజనేయ వంటి ప్రముఖ పాత్రలను ఫైనల్ చేయాల్సి ఉంది. త్వరలోనే ఆ పాత్రలకు సంబంధించిన అప్డేట్ కూడా అవకాశం ఉంది.

రామసేతు కథతో అక్షయ్ కుమార్

రామసేతు కథతో అక్షయ్ కుమార్

అయితే బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ రామ సేతు అనే మరో సినిమాను ఎనౌన్స్ చేశాడు. ఇది కూడా రామాయణం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుండడంతో ప్రభాస్ కి పోటీగా మరో సినిమా అనే కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. సీత జాడ కోసం లంక పయణమయ్యే రాముడి కథలో రామసేతుకు ఎంతటి ప్రాధాన్యత ఉందొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆ పాయింట్ తో సినిమా చేస్తుండడంతో ఓ వర్గం ఆడియెన్స్ లో అంచనాలు పెరిగాయి.

Recommended Video

#BeatsOfRadheShyam : New Motion-Poster Released From Radhe Shyam
ఆ కథలకు సంబంధం లేదు

ఆ కథలకు సంబంధం లేదు

ఇక అక్షయ్ చేస్తున్న కాన్సెప్ట్ ప్రభాస్ సినిమాకు పెద్దగా సంబంధం ఉండదు. హిస్టారికల్ కథతో రాబోతున్న ఆదిపురుష్ మరోసారి రామాయణ గొప్పతనాన్ని చూపించనుండగా అక్షయ్ కుమార్ రామసేతు మాత్రం గత చరిత్ర ఆధారాలను వెలికితీసే నేటితరం కథ. ఈ రెండింటికి చాలా తేడా ఉంది కాని బ్యాక్ డ్రాప్ మాత్రం రామాయణ కథనే. మరి ఇద్దరు హీరోల్లో ఆడియెన్స్ ని ఎవరు ఎక్కువగా ఆకట్టుకుంటారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X