కనికరించిన ప్రభాస్ & టీమ్.. ఆ సినిమా ఫస్ట్ లుక్ డేట్ ఫిక్స్.. టైటిల్ అదేనా?

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తరువాత అయినా స్పీడ్ పెంచుతాడేమో అనుకుంటే మళ్ళీ అదే తరహాలో కంటిన్యూ అవుతున్నాడు అనే విమర్శలు ఎక్కువగా వచ్చిన విషయం తెలిసిందే. సాహో తరువాత కూడా అదే తీరు కొనసాగడంతో అభిమానులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఫైనల్ గా నేడు ప్రభాస్ 20వ చిత్రంపై ఒక క్లారిటీ ఇచ్చారు. సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయడానికి ఒక డేట్ ని ఫిక్స్ చేశారు.

యూవీ క్రియేషన్స్ ప్లానింగ్

యూవీ క్రియేషన్స్ ప్లానింగ్

జిల్ దర్శకుడు రాధాకృష్ణ బహుబలి సెకండ్ పార్ట్ రిలీజ్ సమయంలోనే ప్రభాస్ కోసం కథను సిద్ధం చేశాడు. సాహోను తొందరగా ఫినిష్ చేసి 20వ ప్రాజెక్టును కూడా వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలని అనుకున్నాడు. కానీ పాన్ ఇండియా క్రేజ్ వలన ఆలస్యం చేయక తప్పలేదు. యూవీ క్రియేషన్స్ ప్లానింగ్ ఎంత చేసినా కూడా అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయదు అనే అపకీర్తిని మూటగట్టుకుంది.

మొత్తానికి కనికరించారు..

మొత్తానికి కనికరించారు..

ఇక ప్రభాస్ 20వ సినిమా విషయంలో ఏళ్ళు గడుస్తున్నా అప్డేట్ ఇవ్వకపోవడంతో గత కొన్ని నెలలుగా అభిమానులు గుర్రుగానే ఉన్నారు. ఇక ఫైనల్ గా ఆ సినిమా విషయంలో ఒక అప్డేట్ ఇచ్చారు. ఈ నెల 10వ తేదీన ఉదయం 10గంటలకు ప్రభాస్ ఫస్ట్ లుక్ ని చూపించబోతున్నారు. అఫీషియల్ గా చెప్పిన యూవీ క్రియేషన్స్ మొత్తానికి అభిమానులనైతే కూల్ చేసింది.

అభిమానుల ఆగ్రహం..

అభిమానుల ఆగ్రహం..

గతంలో పండగలకు ఇతర హీరోలు ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో అభిమానులకు కిక్కిస్తే.. యూవీ క్రియేషన్స్ మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ప్రభాస్ అభిమానులు ఆగ్రహంతో ఆ ప్రొడక్షన్ సంస్థను బ్యాన్ చేయాలని ట్విట్టర్ లో బ్యాన్ యూవీ క్రియేషన్స్ అనే హ్యాష్ ట్యాగ్ ని వైరల్ చేశారు. సాహో సినిమా విషయంలో నీరాశపరచడమే కాకుండా ఇప్పుడు కొత్త సినిమా విషయంలో కూడా నిదానంగా అడుగులు వేయడం అభిమానులకి ఆగ్రహాన్ని తెప్పించింది.

Recommended Video

Shakeela Rasina Motta Modati Kutumba Katha Chitram Trailer
టైటిల్ అదేనా..

టైటిల్ అదేనా..

ఇక మొత్తానికి ఒక అప్డేట్ ఇవ్వడానికి ముందుకు వచ్చిన యూవీ క్రియేషన్స్ ఈ సారి అభిమానులకు ఎలాంటి కిక్కిస్తుందో చూడాలి. సాహో సినిమాతో హిందీలో తప్పితే మరెక్కడా పెద్దగా లాభాలు అందుకోలేదు. దీంతో ప్రభాస్ ఈ సారి తన 20వ సినిమాతో సాలీడ్ సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. ఈ సినిమాకు రాధే శ్యామ్ అనే టైటిల్ ని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X