మరో మినీ సినిమా వాయిదా.. ప్రభాస్ టీమ్ కామెడీ అప్డేట్
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఒక సినిమా తరువాత మరొక సినిమా వాయిదా పడుతున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విదంగా కరోనా సెకండ్ వేవ్ మరింత ఎక్కువవవ్వడం వలన చిన్న పెద్దా లేకుండా అన్ని సినిమాలు కొత్త డేట్స్ ను వెతుక్కునే పనుల్లో బిజీ అయ్యాయి. ఇక ఆల్ మోస్ట్ రిలీజ్ కు సిద్దమైన సినిమా తేజ సజ్జా ఇష్క్ ఇటీవల వాయిదా పడగా అదే తరహాలో సంతోష్ శోభన్ కొత్త సినిమా కూడా రిలీజ్ నుంచి తప్పుకుంది.
కుక్కపిల్లను చంకనేసుకుని రోడ్డెక్కిన నేహా శర్మ
ప్రభాస్ స్నేహితుల ప్రొడక్షన్ యూవీ క్రియేషన్స్ 'ఏక్ మినీ కథ' అనే సినిమాను నిర్మించిన విషయం తెలిసిందే. వర్షం సినిమా దర్శకుడు శోభన్ తనయుడు ఎలాగైనా హీరోగా నిలదొక్కుకోవాలని ఈ సినిమాతో రెడీ అయ్యాడు. సినిమాను ఏప్రిల్ 30న రిలీజ్ చేస్తున్నట్లు గ్యాప్ లేకుండా ప్రమోషన్ తో ప్రోమోలు వైరల్ అయ్యేలా చేశారు. కానీ సెకండ్ వేవ్ దెబ్బకు థియేటర్స్ కూడా క్లోజ్ అవ్వడంతో రిలీజ్ ను వాయిదా వేశారు. మరొక కామెడీ ప్రొమోతో చిత్ర యూనిట్ రిలీజ్ పై వివరణ ఇచ్చింది.

ప్రస్తుతం బయట నెలకొన్న పరిస్థితులు దృష్ట్యా సినిమా విడుదలకు వాయిదా వేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. అయితే యూవీ క్రియేషన్స్ ప్రభాస్ రాదేశ్యామ్ పై మెత్రం ఇంతవరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో అభిమానులు చిత్ర యూనిట్ తీరుపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాధేశ్యామ్ సినిమాను జిల్ దర్శకుడు రాధా కృష్ణ డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











