For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అందరూ ప్రభాస్ డేట్స్ కోసం వెయిటింగ్, కానీ ఆ స్టార్ డైరెక్టర్ కోసం ప్రభాస్ వెయిటింగ్!

  |

  బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ పెరిగిపోయింది. ఆయన పూర్తిగా చిన్న బడ్జెట్ సినిమాలు చేయడం మానేశారు. బాహుబలి తర్వాత సొంత ప్రొడక్షన్ అయిన యు.వి ప్రొడక్షన్స్ సంస్థతో సాహో అనే సినిమా చేసి రిలీజ్ చేశారు.. ఇక ప్రస్తుతం అదే సంస్థతో రాధేశ్యామ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కాక ఇప్పటికే ఆయన నాలుగైదు సినిమాలు లైన్ లో పెట్టాడు. ఆయనతో సినిమా చేయడానికి బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా చాలా మంది నిర్మాతలు దర్శకులు ఉవ్విళ్లూరుతున్నారు. కానీ ప్రభాస్ మాత్రం మరో దర్శకుడితో సినిమా చేయాలని ఆసక్తి చూపిస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

   అన్నీ ప్యాన్ ఇండియానే

  అన్నీ ప్యాన్ ఇండియానే

  బాహుబలి సిరీస్ చేసిన తర్వాత ప్రభాస్ రేంజ్ పెరిగిపోయింది. దాదాపు ఆయన చేస్తున్న అన్ని సినిమాలు ప్యాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. బాహుబలి తర్వాత ఆయన సాహో అనే సినిమా చేశారు. సుజిత్ దర్శకత్వంలో యు.వి.ప్రొడక్షన్స్ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా ఊహించినంత ఆదరణ దక్కించుకోలేక పోయింది. కలెక్షన్లు బాగానే వచ్చిన సినిమా టాక్ మాత్రం పాజిటివ్ గా రాలేదు. ఈ సినిమా దెబ్బతో ఆయన ప్రస్తుతం చేస్తున్న రాధేశ్యామ్ సినిమాకి కూడా మార్పులు చేర్పులు సూచించారు.

  సాహో ఎఫెక్ట్

  సాహో ఎఫెక్ట్

  రాధేశ్యామ్ కి మార్పులు చేర్పులు చేసిన నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ అంతకంతకూ లేట్ అవుతోంది. ఇప్పటికి కూడా కొంతమేర ప్యాచ్ వర్క్ ఈ సినిమాకు మిగిలి ఉంది. ప్రభాస్ హెయిర్ స్టైలిస్టుకి కరోనా సోకడంతో ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతానికి నిలిపివేశారు. ఇక ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే ఆయన మరో రెండు సినిమాల షూటింగ్ కూడా మొదలు పెట్టాడన్న సంగతి తెలిసిందే.

   ఇప్పటికే మూడు షూటింగ్

  ఇప్పటికే మూడు షూటింగ్

  బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆయన ఆది పురుష్ అనే సినిమా చేస్తున్నాడు. రామాయణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా లో ప్రభాస్ రాముడిగా నటిస్తున్నాడు. సైఫ్ అలీఖాన్ రావణుడిగా, కృతిసనన్ సీతగా నటిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమా కాకుండా ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా కొంత మేర తెలంగాణలోని రామగుండం జిల్లాలో జరిగింది. ఈ సినిమాలో శృతి హసన్ హీరోయిన్ గా నటిస్తోంది.

   మరో రెండు లైన్ లో

  మరో రెండు లైన్ లో

  ఇక ఇవి కాకుండా ఆయన నాగ్ అశ్విన్ తో ఒక సైంటిఫిక్ థ్రిల్లర్ అలాగే సిద్ధార్థ ఆనంద్ తో మరో సినిమా కూడా చేస్తున్నారు.. అన్ని సినిమాలు లైన్ లో ఉండగా ఇంకా ప్రభాస్ కోసం ప్రభాస్ డేట్స్ కోసం ఎదురుచూసే దర్శకులు నిర్మాతలు సంఖ్య పెద్దగానే ఉంది. అయితే ఎంత మంది ప్రభాస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నా ప్రభాస్ రోజు మాత్రం వేరే దర్శకుడు కోసం ఎదురుచూస్తున్నారు.

  ఆయనతో చేయాలని ఉందట

  ఆయనతో చేయాలని ఉందట

  ఆ దర్శకుడు మరెవరో కాదు రాజ్ కుమార్ హిరానీ. ఒక రకంగా ఆయనను బాలీవుడ్ రాజమౌళి అని చెబితే తెలుగు ప్రేక్షకులకు బాగా అర్థమవుతుంది. దాదాపుగా హిందీలో ఆయన తెరకెక్కించిన అన్ని సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక ఆయనతో కలిసి ప్రభాస్ కు ఒక సినిమా చేయాలని ఉందట. తాజాగా ఈ విషయాన్ని ప్రభాస్ ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నాడు

  20 సార్లు చూసి ఉంటాడట

  20 సార్లు చూసి ఉంటాడట

  తాజాగా ఇంటర్వ్యూలో ప్రభాస్ మాట్లాడుతూ 3 ఇడియట్స్, మున్నాభాయ్ ఎంబీబీఎస్ అనేవి తన ఆల్ టైం ఫేవరేట్ సినిమాలు అని చెప్పుకొచ్చాడు. ఒక్కో పదాన్ని దాదాపు 20 సార్లు దాకా చూసి ఉంటానని ఈ సినిమాల దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ అంటే తనకు చాలా అభిమానం అని చెప్పుకొచ్చాడు. బహుశా ఎప్పటికైనా ఆయనతో కలిసి పనిచేసే అవకాశం దొరుకుతుందేమో అని ప్రభాస్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

  English summary
  Prabhas is one of the busiest actors in Indian cinema currently. He already has close to half a dozen films in the pipeline. hen top filmmakers are eager to join hands with Prabhas, he is waiting for an opportunity to work with Raj Kumar Hirani. prabhas he opened up about the same in a recent interview.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X