నాగార్జున 'బిగ్ బాస్ 3' లో ప్రభాస్.. సరికొత్తగా ఆలోచించి
ఈ రోజుల్లో ఓ సినిమా నిర్మించడం ఎంత ముఖ్యమో.. ఆ సినిమాకు సరైన ప్రమోషన్ కార్యక్రమాలు కూడా అంతకంటే ఎక్కువ ముఖ్యం. సినిమాకు సరైన ప్రమోషన్ దక్కలేదంటే ఆ సినిమా విజయానికి అక్కడే సంగం తూట్లు పడినట్లు లెక్క. ఈ విషయం నేటితరం దర్శక నిర్మాతలకు బాగా తెలుసు. అందుకే చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలపై స్పెషల్ ఫోకస్ చేస్తూ విడుదలకు ముందే ఫుల్లుగా ప్రమోషన్స్ చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ కోసం బుల్లితెర రియాలిటీ షోస్ కి వెళ్లడం లాంటి వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుడుతున్నారు. బుల్లితెర రియాలిటీ షోస్‌కి ఆదరణ ఎక్కువాగా ఉంటుంది కాబట్టి తమ సినిమా ఈజీగా జనాల్లోకి వెళ్లిపోతుందనేది వారి ప్లాన్.
సరిగ్గా ఇదే ఫార్ములాను ప్రభాస్ కొత్త సినిమా సాహూ పై అప్లై చేస్తున్నారట ఆ చిత్ర దర్శకనిర్మాతలు. ఈ ఆగస్టు లోనే సాహూ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో బుల్లితెర రియాలిటీ షో 'బిగ్ బాస్ 3' కి స్పెషల్ గెస్టులుగా అటెండ్ కావాలని భావిస్తున్నారట ప్రభాస్. బిగ్ బాస్ 3 జులై చివరి వారంలో ప్రారంభం కానుంది కాబట్టి సాహూ ప్రమోషన్స్ కోసం ఈ షోకి గెస్ట్‌గా వెళ్లడం చాలా ఉపయోగకరం అని యూనిట్ సభ్యులు భావిస్తున్నారట. దీంతో పాటు పలు ఛానెల్స్ నిర్వహిస్తున్న రియాలిటీ షోల్లో గెస్టులుగా భాగం కానున్నారట ప్రభాస్, శ్రద్ద కపూర్. ఇదే జరిగితే సాహూ ప్రమోషన్స్‌కి కొదవే లేదు.

యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది సాహూ మూవీ. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తుండగా శ్రద్ద కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. హాలీవుడ్ రేంజ్ లో పూర్తిస్థాయి యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా ఆగస్టు 15 వ తేదీన విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











