ప్రభాస్ ఫ్యాన్స్‌కు క్రేజీ న్యూస్.. త్వరలోనే రెండు శుభవార్తలు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు శుభవార్త. లాక్‌డౌన్ కారణంగా ఆగిపోయిన ప్రభాస్ 20 చిత్రం సెట్స్‌పైకి త్వరలోనే వెళ్తుందనే వార్త సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. ఇంకా టైటిల్ ఖరారు కానీ ప్రభాస్20 చిత్రం కోసం ఇటలీని తలపించే విధంగా భారీ సెట్‌ను హైదరాబాద్‌లో రూపొందిస్తున్నట్టు తెలిసింది.

లాక్‌డౌన్‌కు ముందు జార్జియా, ఇటలీలో ప్రభాస్ 20 చిత్రం సినిమా షూటింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నందున్న ఫారిన్ లొకేషన్ షూట్ ఇక్కడే వేసి షూట్ ముగించాలనే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం.

 Prabhas20 movie will go on sets in July first week

అయితే సడలింపుల నేపథ్యంలో జూలై మొదటి వారంలో ఈ చిత్రం సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో ఆర్ట్ డైరెక్టర్ రవిందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సెట్ నిర్మాణం జరుగుతున్నట్టు తెలిసింది.

యూవీ క్రియేషన్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్గే హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి జిల్ ఫేం దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మైనే ప్యార్ కియాతో ప్రేక్షకులను దోచుకొన్న భాగ్యశ్రీ కీలక పాత్రను పోషిస్తున్నారు.

ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్, టైటిల్ అనౌన్స్‌మెంట్ వార్తను త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ వారంలోనే ప్రభాస్20కి సంబంధించిన కీలకమైన ప్రకటన రానున్నదని యూనిట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. చాలా కాలంలో ఎదురు చూస్తున్న అభిమానుల్లో క్రేజ్ నింపడానికి యూనిట్ ఓ టీజర్ వదిలేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X