Mr Perfect Re Release: ప్రభాస్ బర్త్‌డే కానుకగా Mr. ఫర్‌ఫెక్ట్.. బాక్సాఫీస్‌ను రఫాడించేందుకు రెబల్ స్టార్!
తెలుగు సినిమా రంగంలో గతంలో బ్లాక్ బస్టర్స్, సూపర్ హిట్స్‌గా నిలిచిన సినిమాలతోపాటు అభిమానులకు క్లాసింగ్ ఫీలింగ్స్ అందించిన చిత్రాలను రీ రిలీజ్ పేరుతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడమనే ఆనవాయితీ కొనసాగుతున్నది. టాప్ హీరోల రీరీలీజ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించడమే కాకుండా ఈతరం ప్రేక్షకులు, హీరోల అభిమానులకు సరికొత్త అనుభూతిని పంచుతున్నాయి. ఈ క్రమంలో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అనే చిత్రాన్ని రీ రిలీజ్ చేసేందుకు నిర్మాత సిద్దమయ్యారు. ఆ వివరాల్లోకి వెళితే..
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై పాపులర్ నిర్మాత దిల్ రాజు నిర్మించిన చిత్రం మిస్టర్ ఫర్‌ఫెక్ట్. సెన్సిబుల్ డైరెక్టర్ దశరథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ప్రభాస్ సరసన కాజల్ అగర్వాల్, తాప్సీ పన్నుతోపాటు మురళీ మోహన్, రావు రమేష్, నాజర్, ప్రకాశ్ రాజ్, సాయాజీ షిండే, కే విశ్వనాథ్, బ్రహ్మనందం, ప్రగతి తదితరులు నటించారు.

భారీ తారాగణంతో రూపొందిన ఈ ఫ్యామిలీ, లవ్, ఎమోషన్స్ డ్రామాకు విజయ్ కే చక్రవర్తి సినిమాటోగ్రఫిని, మార్తాండ్ కే వెంకటేశ్ ఎడిటింగ్, దేవీ శ్రీ ప్రసాద్ సంగీత అందించారు. ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులు, పనిచేసిన సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమా సుమారుగా 15 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు.
ప్రభాస్, దిల్ రాజు కాంబినేషన్‌లో భారీ అంచనాలతో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్లింది. ఫ్యామిలీ, యూత్ అన్నివర్గాలు ఆదరించడంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొన్నది. ఈ సినిమా అప్పట్లోనే సుమారుగా 43 కోట్ల రూపాయల షేర్‌తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొన్నది.

అలాంటి ఫీల్ గుడ్ చిత్రాన్ని మళ్లీ మరోసారి ఈ జనరేషన్ ఆడియెన్స్‌కు రుచి చూపించడానికి రీరీలీజ్ రూపంలో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. ఆరడుగుల కటౌట్ మరికొద్ది రోజుల్లో మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అంటూ ప్రచారం మొదలుపెట్టారు. ఈ సినిమా ప్రచారానికి జోష్, ఇతర మాధ్యమాల్లో జోరుగా ప్రమోషన్స్ కొనసాగిస్తున్నారు.
కల్కి తర్వాత ప్రభాస్ సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు, రెబల్ స్టార్ పుట్టిన రోజు కానుకగా మిస్టర్ పర్‌ఫెక్ట్ రూపంలో కానుకను అందిస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 22వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రారంభమైన అడ్వాన్స్ బుకింగ్‌కు మంచి స్పందన కనిపిస్తున్నది. రీ రిలీజ్ కూడా రికార్డు వసూళ్లు సాధించడం గ్యారెంటీ అని అభిమానులు భరోసాను అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











