Prabhas: ప్రభాస్ 'స్పిరిట్'లో నటించే అవకాశం.. గోల్డెన్ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?

Prabhas Spirit: చాలామందికి సినిమాలలో నటించాలని, తమను తాను వెండి తెరపై చూసుకోవాలని భావిస్తారు. ఆ కోరికతో ఫిలింనగర్ లో అడుగుపెట్టి ప్రొడక్షన్ హౌస్ ల చుట్టూ.. మూవీ మేకర్స్ చుట్టూ.. కాళ్లు అరిగేలా తిరుగుతారు. ఒక్క ఛాన్స్ ఇస్తే.. తమను తాము ప్రూవ్ చేసుకుంటామంటూ రిక్వెస్ట్ చేసుకుంటారు. కేవలం ఇండస్ట్రీలో టాలెంట్ ఉంటేనే సరిపోదు. దాంతో పాటు కాసింత అదృష్టం కూడా ఉండాలి. అలాంటి వారికి అదృష్టం దరిచేయబోతుంది. ఏకంగా ప్రభాస్ 'స్పిరిట్' సినిమాలో నటించే గోల్డెన్ ఛాన్స్ అందుకోవచ్చు. ఆ గోల్డెన్ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాజాసాబ్ షూటింగ్ పూర్తికావడంతో.. హను రాఘవపూడి డైరెక్షన్​ లో వస్తున్న ' ఫౌజీ 'సినిమాను లైన్ లో పెట్టనున్నారు. ప్రస్తుతం ఫౌజీ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్‌ సిటీలో జరుగుతోంది. ఈ సినిమాలోని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారు. దాదాపు సినిమాలోని కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి అవుతాయని తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్‌ తన వింటేజ్‌ లుక్‌తో కనిపించబోతుండటంతో సినిమాపై కూడ భారీగా అంచనాలు పెరిగాయి. ఈ సినిమా పూర్తి అయినా తరువాత 'స్పిరిట్‌'(Spirit) సినిమా షూటింగ్ లో పాల్గొన అవకాశముంది.

Prabhas s Spirit Movie Invites Auditions for Aspiring Actors

ప్రభాస్‌ హీరోగా డైరెక్టర్ సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'స్పిరిట్‌' సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా రెగ్యులర్‌ షూట్‌ను మార్చ్ లో ప్రారంభించాలని యూనిట్‌ ప్లాన్‌ చేస్తోందని సమాచారం. ప్రభాస్‌ తన కెరీర్ తొలిసారిగా పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపించబోతున్నారు. ఇందుకోసం ప్రభాస్ లుక్స్, ఫిజిక్‌ పరంగా స్పెషల్‌ మేకోవర్‌ కు సిద్దం కానున్నారు.ఈ సినిమాలో హీరోయిన్‌గా మృణాల్‌ ఠాకూర్, ఆలియా భట్, రష్మికా మందన్నా..తదితర స్టార్ హీరోయిన్ ల పేర్లు తెరపైకి వస్తున్నాయి. అయితే.. వారితో ఎవరూ కూడా ఫైనలేజ్‌ కాలేదట.

టీ సిరీస్‌ భూషణ్‌ కుమార్, ప్రణయ్‌రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్‌ నిర్మించనున్న 'స్పిరిట్‌'మూవీ 2026 చివర్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. సందీప్ మ్యూజిక్ సిట్టింగ్ లతో పాటు, ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ వార్త ఫిల్మ్ సర్కిల్ లో తెగవైరల్ అవుతోంది. ప్రభాస్ స్పిరిట్ మేకర్స్ నటీనటుల (Cast And Crew) ఎంపికపై దృష్టి సారించింది. ఈ క్రమంలో మేకర్స్​ క్రేజీ అనౌన్స్​మెంట్ చేశారు. నటనపై ఇష్టం, సినిమాల్లో నటించేందుకు ఉత్సాహంగా ఉన్న వారిని, స్పిరిట్ సినిమాలో నటించేందుకు ఎంపిక చేసుకుంటామని ప్రకటించింది మూవీ టీం. ఈ మేరకు ట్విట్టర్ లో అధికారికంగా ప్రకటించారు.

Prabhas s Spirit Movie Invites Auditions for Aspiring Actors

స్పిరిట్ సినిమాలో నటించే అవకాశం అన్ని వయసుల వారికి కూడా కల్పించబోతున్నామని, అయితే థియేటర్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారు మాత్రమే అందుకు అర్హులు అంటూ వెల్లడించారు. అయితే ఇందుకు 2 ఫొటోలు, 2 నిమిషాల వీడియో రికార్డ్ చేసి..spirit.bhadrakalipichtures@gmial.com పంపించాలని ప్రకటించారు. ఆసక్తి గలవారు ఓ వీడియో రికార్డ్ చేసి, ఈ ఈమెయిల్ కు పంపించాలని ప్రకటించారు. ఈ మేరకు 'కాస్టింగ్ కాల్' అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టర్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట్లో వైరల్ గా మారింది.

More from Filmibeat

Read more about: prabhas sandeep reddy vanga
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X