మిస్టర్ ప్రేమికుడుగా ప్రభుదేవా.. ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు..
ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా, అదాశర్మ, నిక్కి గల్రాని హీరో, హీరోయిన్లుగా శక్తి చిదంబరం దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం చార్లీ చాప్లిన్. ఈ చిత్రాన్ని శ్రీ తారకరామ పిక్చర్స్ పతాకంపై ఎమ్‌వీ కృష్ణ సమర్పణలో వీ శ్రీనివాసరావు తెలుగులోకి 'మిస్టర్ ప్రేమికుడు' అనే పేరుతో అనువదిస్తున్నారు. తమిళంలో ఇటీవల విడుదలై ఘన విజయం సాధించింది. ప్రస్తుతం తెలుగు డబ్బింగ్ కార్యక్రమంలో బిజీగా ఉంది. ఏప్రిల్ నెలలోనే మిస్టర్ ప్రేమికుడు చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.
మిస్టర్ ప్రేమికుడు నిర్మాత వీ శ్రీనివాసరావు మాట్లాడుతూ... ప్రభుదేవా హీరోగా నటించిన సినిమాలంటే అంటే తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకమైన అభిమానం. అందుకే ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువదిస్తున్నాం. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలోని పాటలతో పాటు సెకండాఫ్ లో వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయి అని అన్నారు.

మిస్టర్ ప్రేమికుడు చిత్రానికి సంగీతం: అమ్రీష్; స్టంట్స్: కణల్ కన్నన్; సినిమాటోగ్రాఫర్: సౌందర్ రాజన్; సమర్పణ: ఎమ్.వి.కృష్ణ; కో-ప్రొడ్యూసర్స్: మహేష్ చౌదరి గుర్రం, శంకరరావు సారికి; నిర్మాత: వీ శ్రీనివాసరావు; దర్శకత్వం: శక్తి చిదంబరం.


Click it and Unblock the Notifications











