Just In
- 16 min ago
రామ్ చరణ్ చేయాల్సిన కథలో అల్లు అర్జున్.. యూ టర్న్ తీసుకున్న యువ దర్శకుడు!
- 20 min ago
జబర్ధస్త్ వర్ష కుటుంబంలో విషాదం: బ్యాడ్ న్యూస్ చెప్పి బోరుమన్న బ్యూటీ.. ఏకంగా పైనుంచి దూకేయడంతో!
- 53 min ago
ఎందుకు రా ఇలా.. పేరెంట్స్ లేని మరో అభిమాని పిచ్చికి షాక్ అయిన నాగ చైతన్య
- 1 hr ago
Check Movie 10 days collections: నితిన్‌కు షాకిచ్చిన ఆడియెన్స్.. భయపెడుతోన్న భారీ టార్గెట్!
Don't Miss!
- Lifestyle
గర్భస్రావం తర్వాత మళ్లీ గర్భం ధరించడానికి మీకు సహాయపడే కొన్ని మార్గాలు ఇక్కడ ఉన్నాయి!
- News
చచ్చిపోదామనుకున్నా..ఆ కుటుంబంలో ఎన్నో అవమానాలు: మేఘన్ మార్కెల్ సంచలన వ్యాఖ్యలు
- Finance
భారీ లాభాల నుండి స్వల్ప లాభాల్లోకి స్టాక్ మార్కెట్లు
- Automobiles
అద్భుతంగా ఉన్న శ్రీమంతుడు 'మహేష్ బాబు' కారావ్యాన్.. మీరూ ఓ లుక్కేయండి
- Sports
India vs England: టీ20 సిరీస్ ముందు ఇంగ్లండ్‌కు భారీ షాక్.. స్టార్ పేసర్ ఔట్! ఐపీఎల్ 2021కు డౌటే!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హీరో అవ్వడానికి అసలు కారణమిదే.. ఆ హీరోను చూసిన రోజే నిర్ణయించుకున్నా: యాంకర్ ప్రదీప్
తెలుగు ఇండస్ట్రీలో బెస్ట్ యాంకర్స్ లో సుమ డామినేషన్ ఎప్పటికి ఉండేదే. అయితే ఆమె తరువాత బెస్ట్ యాంకర్ గా కొనసాగుతున్న వారిలో ప్రదీప్ మాచిరాజు కూడా ఉన్నాడు. రియాలిటీ షాలతోనే కాకుండా టాక్ షోలతో అగ్ర హీరోలను చాలా క్లోజ్ గా ఇంటర్వ్యూలు చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ప్రదీప్ హీరోగా ఒక సినిమా చేసిన విషయం తెలిసిందే. ఇక ఆ మొదటి సినిమా మరికొన్ని రోజుల్లో విడుదల అవుతుండగా ప్రదీప్ ప్రమోషన్స్ లలో ఆసక్తికరమైన విషయాలను చెబుతున్నాడు.
టీవీ యాంకర్ అర్చన విజయ: బికినిలో అందాలు ఆరబోత (ఫొటోలు)

పాటతోనే బజ్ క్రియేట్ చేసి..
యాంకర్ గా ఎంతగానో క్రేజ్ అందుకున్న ప్రదీప్ మాచిరాజు మొదటిసారి బిగ్ స్క్రీన్ పై కథానాయకుడిగా కనిపించబోతున్న విషయం తెలిసిందే. '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' అనే ఆ సినిమా ఓ వర్గం ఆడియెన్స్ లో అయితే అంచనాలను బాగానే క్రియేట్ చేసింది. ఇటీవల ట్రైలర్ ను కూడా విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతకుముందు నీలి నీలి ఆకాశం పాట ఏ రేంజ్ లో హిట్టయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

రిలీజ్ ఎప్పుడంటే..
30 రోజుల్లో ప్రేమించడం ఎలా? మొత్తానికి జనవరి 29న గ్రాండ్ గా విడుదల కాబోతోంది. అసలైతే ఈ సినిమాను గత ఏడాది సమ్మర్ లోనే విడుదల చేయాల్సింది. కరోనా లాక్ డౌన్ కంటే ముందే సినిమాను రెడీ చేశారు. కానీ లాక్ డౌన్ దెబ్బకు వాయిదా వేయాల్సి వచ్చింది. ఇక ఫైనల్ గా నెక్స్ట్ వీక్ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది.

హీరో అవ్వడానికి కారణం..
ఇక వరుస ఇంటర్వ్యూలతో ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న ప్రదీప్ గతంలో యాంకర్ గా చేస్తూనే కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే. అయితే ఇన్నాళ్లు లేనిది ఇప్పుడే హీరో కావడానికి కారణం ఏమిటి? అసలు హీరో అవ్వాలనే ఆలోచన మొదట ఎప్పుడు పుట్టింది అనే ప్రశ్నలకు ప్రదీప్ క్లారిటీ ఇచ్చాడు.

పవన్ కళ్యాణ్ ను చూడగానే ఫిక్స్ అయ్యాను
ప్రదీప్ మాట్లాడుతూ.. నేను హీరో అవ్వడానికి మొదటి కారణం పవన్ కళ్యాణ్. ఆయనను తమ్ముడు సినిమాలో చూసినప్పుడే హీరో అవ్వాలని ఫిక్స్ అయ్యాను. అయితే హీరో అవ్వడానికి సరైన కథ, సమయం సెట్టవ్వాలి. మొత్తానికి ఆ టైమ్ ఇప్పుడు వచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా ఈ సినిమా ఆడియెన్స్ ను మెప్పిస్తుందని నమ్ముతున్నట్లు ప్రదీప్ వివరణ ఇచ్చాడు.