30 రోజుల్లో ప్రేమించడం ఎలా? ఆ విషయం చెప్పేందుకు డేట్ ఫిక్స్..
ఇన్నాళ్లు బుల్లితెరపై సందడి చేసిన యాంకర్ ప్రదీప్.. ఇకపై వెండితెర ప్రేక్షకులను కూడా అలరించబోతున్నాడు. ప్రదీప్ హీరోగా మన ముందుకు రాబోతున్న న్యూ మూవీ '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?'. ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు మున్నా ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. సుకుమార్ తో కలిసి ఈయనకు ''ఆర్య 2, నేనొక్కడినే'' లాంటి సూపర్ హిట్ సినిమాలకు పని చేసిన అనుభవముంది. చిత్రంలో ప్రదీప్ సరసన అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటించింది. బడ్జెట్ విషయంలో ఎక్కడా వెనకాడకుండా ఎస్వీ బాబు ఈ సినిమాను నిర్మించారు.

రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను మర్చి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు మేకర్స్. జీఏ2, యూవీ క్రియేషన్స్ సంస్థలు ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నాయి.
ఇకపోతే చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే విడుదలైన 'నీలి నీలి ఆకాశం..' సాంగ్ సంగీత ప్రియుల విశేషంగా ఆకట్టుకొని వైరల్‌గా మారింది. అదే విధంగా ఇటీవలే విడుదల చేసిన 'మీకో దండం..' పాట కూడా ఆకట్టుకుంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ పాటలు సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి.


Click it and Unblock the Notifications











