హీరోయిన్ సంచలన పోస్ట్ .. ఏ ఆడదానికి ఇలా జరక్కూడదు అంటూ 

ప్రస్తుతం మారిపోతున్న ఆధునిక ప్రపంచంలో ఇతరుల ప్రైవసీ అనేది అంతకంతకు తగ్గిపోతూ వస్తుంది అని చెప్పాలి. సామాన్య జనమే ఈ కొత్త టెక్నాలజీలు, ఏఐ లతో ఇబ్బందులు పడుతుంటే ఇక సినీ రంగానికి చెందిన ప్రముఖులు.. ముఖ్యంగా హీరోయిన్స్ వంటి వారు ఐతే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

అప్పట్లో ఇంటర్నెట్ లో అయితే పలువులు హీరోయిన్స్ పై అసభ్యకరంగా ఫోటోలు మార్ఫింగ్ చేస్తూ కొందరు ఆకతాయిలు దారుణంగా ప్రవర్తించే వారు. అప్పటి నుంచి ఇపుడు వరకు టెక్నాలజీ ఎంతలా మారిపోయింది. ఇప్పుడు అయితే ఏకంగా అచ్చు గుద్దినట్టు నిజమైన వీడియోలులా పలువురు హీరోయిన్స్ పై ప్రైవేట్ వీడియోస్ బయటకి వచ్చేస్తున్నాయి. ఇవి దాదాపు అన్ని సినీ పరిశ్రమల్లో ఉన్న హీరోయిన్స్ ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి.

pragya nagra sensational post on her private video leak

అయితే ఇపుడు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి రావడం మూలాన అసలు ఏది నిజం ఏది అబద్దం అనేది అర్ధం కాని పరిస్థితి. ఆ మధ్య స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా కూడా ఈ డీప్ ఫేక్ వీడియోలని ఎదుర్కోవాల్సి వచ్చింది. మరి లేటెస్ట్ గా అయితే సోషల్ మీడియాలో సంచలనం రేపింది యువ నటి ప్రగ్యా నగ్రా పేరు. ఈమె తెలుగులో కేవలం ఒకే ఒక్క సినిమా రీసెంట్ గా "లగ్గం" లో కనిపించింది.

కానీ అటు కన్నడ, మలయాళంలో ఈమె బాగా పాపులర్. అయితే ఈమె పైనే ఓ ప్రైవేట్ స్పేస్ వీడియో లీక్ కావడంతో చిత్ర పరిశ్రమ ఉలిక్కి పడింది. ఈ లింక్ కావాలంటే ఫాలో కొట్టండి రీపోస్టులు చెయ్యాలి అంటూ ఈ రెండు మూడు రోజులుగా కొందరు సోషల్ మీడియాని షేక్ చేసేసారు. కాగా ఎట్టకేలకి తన ప్రైవేట్ వీడియో అంటూ సర్క్యులేట్ అవుతున్న వార్తలపై ప్రగ్యా స్పందించింది.

"నేను ఇప్పటికీ ఆ వీడియోని ఖండిస్తాను. అదంతా ఒక పీడ కల లానే అనిపిస్తుంది. టెక్నాలజీ అనేది మంచి కోసం వాడుకోవాలి కానీ ఇలా అవతలి వారి జీవితాలని నాశనం చేసేందుకు కాదు. తనపై ఇలా ఏఐతో వీడియో సృష్టించిన మృగాలు, దానిని ఇంతలా స్ప్రెడ్ చేసిన మనుషులపై జాలేస్తుంది. ఈ కష్టతర సమయంలో నాకు సపోర్ట్ గా ఉన్నవారికి థాంక్స్ చెబుతున్నాను. నాలా వేరే ఏ ఆడదానికి ఇలా జరగకూడదు అని నేను కోరుకుంటున్నాను.. దయచేసి మీరు సేఫ్ గా ఉండండి అంటూ" ప్రగ్యా నగ్రా విచారం వ్యక్తం చేశారు.

అలాగే ఆమె సైబర్ క్రైమ్‌కి కూడా కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనిపై కొందరు నెటిజన్స్ ఖచ్చితంగా ఆ వీడియోని సర్క్యులేట్ చేసిన ప్రతీ ఒక్కడిని పట్టుకోవాలని నెటిజన్లు మద్ధతుగా నిలుస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోని క్రియేట్ చేసింది ఎవరు? అసలు ఎక్కడ నుంచి వచ్చింది? అనేది పోలీసులు కనిపెడతారో లేదో చూడాలి మరి.

More from Filmibeat

Read more about: pragya nagra rashmika mandanna
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X