ఉపాసనకు పుట్టబోయే బిడ్డ కోసం ఊహించని గిఫ్ట్.. ఎవరు? ఏం పంపించారో తెలుసా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్-ఉపాసన ఇద్దరు రెండు ఉన్నతమైన కుటుంబాల నుంచి వచ్చినవారు. వీరి ఇద్దరిది పెద్దలు కుదిర్చిన వివాహమైనప్పటికీ కూడా ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాతనే సాంప్రదాయ ప్రకారం పెళ్లి చేసుకున్నారు. ఇక వీరి వివాహం 2012లో వైభవంగా జరిగింది. పెళ్లయిన పదేళ్లకు రామ్ చరణ్-ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈ దంపతులిద్దరికి ఊహించని బహుమతి అందింది. అది ఏంటి..? ఎవరు ఇచ్చారు? అనే వివరాల్లోకి వెళితే..
రామ్ చరణ్-ఉపాసన కొణిదెల పెళ్లయి చాలా ఏళ్లు అవుతున్న పిల్లలకు సంబంధించి ఎలాంటి విషయం చెప్పకపోయేసరికి అప్పట్లో హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. అయితే శ్రీ హనుమాన్ దీవెనలతో ఉపాసన, రామ్ చరణ్ వారి మొదటి బిడ్డను కనడానికి సిద్ధంగా ఉన్నారు అని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా అధికారికంగా తెలియజేయడంతో అభిమానుల్లో సంతోషం వెల్లువిరిసింది. అయితే ఉపాసన సరోగసి ద్వారా బిడ్డను కనబోతుందనే వార్తలకు సైతం స్ట్రాంగ్ ఇచ్చారు.

ఇప్పటికే ఉపాసన కొణిదెల బేబీ బంప్ ఉన్న ఫొటోలు, బేబీ షవర్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక అతి త్వరలోనే రామ్ చరణ్-ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కానున్న సందర్భంగా వారికి అనూహ్యమైన బహుమతి అందింది. రామ్ చరణ్-ఉపాసనకు పుట్టబోయే బిడ్డ కోసం ఊయల (Cradle Gift) గిఫ్టుగా అందజేశారు. ఈ బహుమతిని ప్రజ్వల ఫౌండేషన్ (Prajwala Foundatio)కు చెందిన మహిళలు స్వయంగా తయారు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ ఊయల గిఫ్టుకు సంబంధించిన వీడియోను ఇన్ స్టాలో పోస్ట్ చేశారు ఉపాసన కొణిదెల. "అద్భుతమైన మహిళల నుంచి ఈ హృదయపూర్వక బహుమతిని అందుకోవడం గర్వంగా ఉంది. వాళ్లు స్వయంగా తయారు చేసిన.. అపారమైన ప్రాముఖ్యత కలిగిన ఈ ఊయల.. ధైర్యం, బలం, ఆశకు ప్రతీకగా గుర్తుండి పోతుంది. ఇది ధైర్యవంతులైన మహిళల పరివర్తన, ఆత్మగౌరవ ప్రయాణాన్ని సూచిస్తుండగా.. పుట్టినప్పటి నుంచే ఇలాంటి విషయాల పట్ల నా బిడ్డకు అవగాహన పెంపొందాలని కోరుకుంటున్నా" అని ఉపాసన ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఇదిలా ఉంటే తనకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం కోసం ప్రత్యేకమైన జాగ్రత్తలతోపాటు కీలక నిర్ణయం తీసుకున్నారు ఉపాసన. అందులో ముఖ్యంగా బేబీ కార్డ్ బ్లడ్ బ్యాంక్ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించారు. భవిష్యత్తులో బేబీతోపాటు కుటుంబ ఆరోగ్యం కోసం అత్యాధునిక పద్ధతిలో స్టెమ్ సెల్ బ్యాంకింగ్ విధానం ఎంచుకున్నట్లు ఇటీవల సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











