For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  MAA Elections: మేము ఏంటో చూసిస్తాం.. అభ్యర్థులను ప్రకటించిన ప్రకాష్ రాజ్.. ట్విస్ట్ ఇచ్చిన జీవిత రాజశేఖర్

  |

  మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ఎన్నికలు అక్టోబర్ 10 న జరుగనున్న విషయం తెలిసిందే. ఇక ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మా అధ్యక్ష పదవికి ప్రధాన పోటీదారులుగా నిలుస్తున్నారు. దీంతో ఇండస్ట్రీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. MAA అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న నరేష్ మరోసారి ఎన్నికల్లో కీలక పాత్ర పోషించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు మొదట అధ్యక్ష పదవికి పోటీ చేయాలని భావించిన జీవిత రాజశేఖర్ అనంతరం హఠాత్తుగా ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో జనరల్ సెక్రెటరీగా పోటీకి సిద్ధమయ్యారు. ఇక ఫైనల్ గా ప్రెస్ మీట్ నిర్వహించిన నటుడు ప్రకాష్ రాజ్ సినీ మా బిడ్డలు అంటూ ఫుల్ జాబితాను రిలీజ్ చేశారు. అందుకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

   ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో జీవిత

  ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో జీవిత

  మొదట జీవిత రాజశేఖర్ నరేష్ ప్యానెల్ నుండి కార్యదర్శిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఇక్కడ ఒక భారీ ట్విస్ట్ వచ్చింది. నరేష్ ప్యానెల్‌లో ఉన్న జీవిత రాజశేఖర్ తన స్టాండ్ మార్చుకున్నారు మరియు ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుండి జనరల్ సెక్రటరీగా పోటీ చేయనున్నారు. శుక్రవారం ప్రెస్ మీట్‌లో, ప్రకాష్ రాజ్ మీడియాకు ఇదే విషయాన్ని ప్రకటించారు. జీవిత రాజశేఖర్ ప్రకాష్ రాజ్‌కు సహాయపడగలరు కాబట్టి ఇది ఒక భారీ పరిణామం. ఈ ఆకస్మిక మార్పు వెనుక స్టార్ హీరో హస్తం ఉందని వార్తలు కూడా వస్తున్నాయి.

   మెగాస్టార్ పాత్ర?

  మెగాస్టార్ పాత్ర?

  ఇక మరోవైపు మెగాస్టార్ చిరంజీవి ఈసారి ప్రకాష్ రాజ్‌కు తన మద్దతును అందిస్తున్నారు. అలాగే చిరంజీవి జీవితతో చర్చలు జరిపారని, ప్రకాష్ రాజ్ పక్షాన ఉండేలా ఒప్పించారని నివేదికలు చెబుతున్నాయి. మెగా చర్చలు ఖచ్చితంగా ప్రకాష్ రాజ్‌కు సహాయపడవచ్చు అనే టాక్ కూడా వస్తోంది. ఇక జీవిత ప్రకాష్ రాజ్ ప్యానెల్‌లోకి దూకడంతో, మిగతా పోటీదారులు ఎలా స్పందిస్తారో చూడాలి.

  MAA Election : Jeevita Rajasekhar Vs Prakash Raj Vs Manchu Vishnu| Triangular Fight|Filmibeat Telugu
  ప్రకాష్ రాజ్ ప్యానెల్ పోటీదారులు.. ఫుల్ లిస్ట్

  ప్రకాష్ రాజ్ ప్యానెల్ పోటీదారులు.. ఫుల్ లిస్ట్

  ఇక సినీ మా బిడ్డలు ప్యానెల్ లిస్టు ఈ విధంగా ఉంది. ప్రకాష్ రాజ్ అధ్యక్షుడిగా పోటీ చేస్తుండగా హీరో శ్రీకాంత్ ప్రత్యేక ఉపాధ్యక్షుడి పదవికి సిద్ధంగా ఉన్నారు. వైజ్ ప్రెసిడెంట్ అభ్యర్డులో లలో బెనర్జీ, హేమ ఉన్నారు. జీవిత రాజశేఖర్ జెనరల్ సెక్రటరీగా పోటీలో ఉండగా.. ఉత్తేజ్, అనితా చౌదరి వంటి వారు జాయింట్ సెక్రెటరీగా పోటీ పడేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఇక ట్రెజరర్ గా శ్రీ నాగినుడు ఉన్నారు. ఎక్స్ క్యూటీవ్ కమిటీ మెంబర్స్ లలో.. అనసూయా, అజయ్ , భూపాల్, బ్రహ్మాజీ, ఈటీవీ ప్రభాకర్, గోవిందరావు కయ్యుమ్, కౌశిక్, ప్రగతి, రమణారెడ్డి, శ్రీధర్ రావు, శివారెడ్డి, సమీర్, సుధీర్, సుబ్బరాజు, సురేష్ కొండేటి, తనీష్, టార్జాన్ వంటి ప్రముఖ నటీనటులు ఉన్నారు.

   మేము ఏంటో చేసి చూసిస్తాం

  మేము ఏంటో చేసి చూసిస్తాం

  ఇక ప్రెస్ మీట్ లో మాట్లాడిన ప్రకాష్ రాజ్ ఏ మాత్రం వివదస్పదంగా మాట్లాడకుండా.. సినీ ఇండ‌స్ట్రీకి సేవ చేయాల‌న్న‌దే మా ల‌క్ష్యమని తెలియజేశారు. మేము ఏంటో చేసి చూసిస్తాం అంటూ మా ప్యాన‌ల్‌లో మ‌హిళ‌ల‌కు అవకాశం క‌ల్పించాం అని అన్ని అంశాల‌ను ఆలోచించిన త‌రువాతే ప్యాన‌ల్ ప్ర‌క‌టించినట్లు చెప్పారు. ఇక రాజకీయ ఎత్తుగడలతోనే హేమ, జీవిత రాజశేఖర్ వంటి వారిని ప్యానెల్ లోకి లాగినట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటు నిజం లేదని అన్నారు. మంచి చేయాలనే ఆలోచనలను వారి ముందు ఉంచగానే మా వైపు నిలబడ్డారని మరికొందరితో కూడా మాట్లాడడం జరిగిందని అయితే కొందరు తమతో కలవడానికి ఒప్పుకోలేదని కూడా ప్రకాష్ రాజ్ వివరణ ఇచ్చారు.

  మరోవైపు విష్ణు బిల్డింగ్ ప్రయత్నాలు

  మరోవైపు విష్ణు బిల్డింగ్ ప్రయత్నాలు

  ఇక మరోవైపు, MAA భవనం కోసం అయ్యే ఖర్చులను తాను చూసుకుంటానని ఇప్పటికే హామీ ఇచ్చినందున సభ్యులు తనను అధ్యక్షుడిగా ఎన్నుకుంటారని మంచు విష్ణు ఆశిస్తున్నారు. అసోసియేషన్ భవనాన్ని నిర్మించడానికి విష్ణు ఇప్పటికే మూడు ప్రదేశాలను సెర్చ్ చేసినట్లు చెప్పారు. వీలైనంత త్వరగా అందులో ఎదో ఒక చోట భవనాన్ని నిర్మించి మా కమిటీకి ఒక ప్రత్యేకమైన బిల్డింగ్ ను ఏర్పాటు చేస్తానని అన్నారు. దీంతో ఎన్నికలపై ఒక తెలియని ఉత్కంఠ నెలకొంది. మరి ఈ పోటీలో ఎవరు గెలుస్తారో చూడాలి.

  English summary
  Prakash raj announcement on maa elections candidates full list, MAA
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X