MAA Elections పవన్ కల్యాణ్ మార్నింగ్ షో కలెక్షన్ అంత ఉండదు మీ బడ్జెట్.. విష్ణు మంచుకు ప్రకాశ్ రాజ్ వార్నింగ్

టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా ఇప్పుడు టాలీవుడ్ నుంచి రెండు ప్యానల్స్ పోటాపోటీగా దిగాయి.. ప్రకాష్ రాజ్ అలాగే మంచు విష్ణు ఇద్దరూ కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తుండగా ఒకరిమీద ఒకరు ఆరోపణలు గుప్పించుకునే పరిస్థితి కనిపిస్తోంది.. తాజాగా ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ మంచు విష్ణు మీద తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఆ వివరాల్లోకి వెళితే

విష్ణు ప్రశ్నించడం బాగోలేదు

విష్ణు ప్రశ్నించడం బాగోలేదు

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్ తాజాగా ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. తాను అని మాటలను అన్నానని మా మాజీ అధ్యక్షుడు నరేష్ అబద్దాలు ఆడుతున్నారని ఆయన మర్యాదగా మాట్లాడటం నేర్చుకో వాలని ప్రకాష్ రాజ్ అన్నారు. ఇక తాను పవన్ కళ్యాణ్ వైపు ఉన్నానా ? లేక ఇండస్ట్రీ వైపు ఉన్నానా? అని మంచు విష్ణు ప్రశ్నించడం బాగోలేదని ఏం పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ వ్యక్తి కాదు అని ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు.


ఇక తాను కర్ణాటకలో పుట్టి తమిళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో నటుడిగా ఎదిగానని అన్నారు. అంత మాత్రాన నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నియమాల్లో ఎక్కడైనా ఉందా అని ఆయన ప్రశ్నించారు. ప్రకాష్ రాజ్ మీద ఏదో ఒక రకమైన విమర్శలు చేయాలని పిచ్చిపిచ్చిగా విమర్శలు చేయడం తగదని పేర్కొన్న ప్రకాష్ రాజ్ తెలుగు సినిమా కోసం ఏ స్థాయిలో మాట్లాడడానికి అయినా తాను సిద్ధమేనని ప్రకటించారు..

ఛాలెంజ్

ఛాలెంజ్


ఇక తెలుగు భాష మాట్లాడినంత మాత్రాన తెలుగు వారు కారని పేర్కొన్న ఆయన ఆత్రేయ, చలం, తిలక్ లాంటి వాళ్ళ గురించి చర్చ పెడితే తాను మాట్లాడగలను అలాగే తెలుగు వ్యాకరణం, చందస్సు, అలంకారాలు మాట్లాడగలిగే సత్తా తనకు ఉందని అన్నారు. ఇలా మాట్లాడగలిగే సత్తా అవతలి ప్యానల్ లో ఒక్కరికైనా ఉందా అని ప్రశ్నించిన ఆయన అసలు పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ వ్యక్తి కాదా? అని ప్రశ్నించారు.

ముందు నటుడే తరువాత రాజకీయ నాయకుడు

ముందు నటుడే తరువాత రాజకీయ నాయకుడు

నిజానికి పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడు అని అందరూ మాట్లాడుతున్నారు కానీ ముందు ఆయన సినీ నటుడు అని తర్వాతే రాజకీయ నాయకుడు అని ప్రకాష్ రాజ్ అన్నారు. మంచు విష్ణును ఉద్దేశిస్తూ పవన్ కళ్యాణ్ సినిమా మార్నింగ్ షో కలెక్షన్ అంత ఉండదు మీ సినిమా బడ్జెట్, మాట్లాడేప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నామో? చూసుకుని ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు.

మీరు చూసుకోండి

మీరు చూసుకోండి

మీకు పొలిటికల్ ఎజెండా ఉంటే మీకు అధికార పార్టీ అండదండలు ఉంటే మీరు చూసుకోండి ముందు పవన్ కళ్యాణ్ ఒక సినీ నటుడు ఆయన రాజకీయ అజెండా మాకు అక్కర్లేదని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. ఇక అసలు పవన్ కళ్యాణ్ పక్కన ఉన్నారా? ఇండస్ట్రీ పక్కన ఉన్నారా? అని అడుగుతున్నారు నాకు ఆయనకు సిద్ధాంతపరంగా విభేదాలు ఉన్నాయనే విషయం పవన్ స్వయంగా చెప్పారు. కానీ సినిమాల్లో కూడా మేము కలిసి నటిస్తాము ఎక్కడ విషయాలు అక్కడే మాట్లాడుకోవాలని ఇలా అన్ని విషయాలలో ఆయన లాగడం కరెక్ట్ కాదని అన్నారు. అయితే ప్రకాష్ రాజ్ ఇలా టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలోనే మంచు విష్ణు సభ్యులందరితో కలిసి సూపర్ స్టార్ కృష్ణ ను కలిసి ఆయన ఆశీస్సులు తీసుకుని ఆ ఫోటోలు మీడియాకు విడుదల చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X