Pawan Kalyan Vs Prakash Raj: ఛీ.. ఛీ అంటూ పవన్ కల్యాణ్‌పై ప్రకాశ్ రాజ్ కామెంట్

విలక్షణ నటుడిగా కోట్లాది మంది అభిమానులు సంపాదించుకున్నారు ప్రకాష్ రాజ్. నాలుగు దశాబ్ధాల నట జీవితంలో ఎన్నో మరపురాని పాత్రలు వేసి ఎన్నో అవార్డులు, రివార్డులు సంపాదించారు. నటనతో పాటు రాజకీయాలు, సామాజిక అంశాల్లోనూ చురుగ్గా ఉండే ప్రకాష్ రాజ్ వివాదాల్లోనూ ఇరుక్కుంటూ ఉంటారు. వేదికలపైనా, సోషల్ మీడియాలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ .. తరచుగా వార్తల్లో నిలుస్తుంటారు. ఇటీవలి కాలంలో తన మిత్రుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై వరుసగా ఘాటు విమర్శలు చేస్తున్నారు ప్రకాష్ రాజ్.

పవన్‌తో సత్సంబంధాలు
పవన్ కళ్యాణ్- ప్రకాష్‌ రాజ్‌లు తొలి నుంచి సన్నిహితంగానే ఉండేవారు. పలు చిత్రాల్లో కలిసి నటించడంతో పాటు మెగాస్టార్ చిరంజీవిని ప్రకాష్ రాజ్ ఎంతో అభిమానిస్తారు. మెగా క్యాంప్‌తోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ప్రవేశించి బిజీపీకి మద్ధతు పలికారో నాటి నుంచి వీరిద్దరి మధ్య గ్యాప్ వస్తోంది. కమ్యూనిస్ట్ భావజాలం కలిగిన ప్రకాష్ రాజ్ తొలి నుంచి బీజేపీకి బద్ధ వ్యతిరేకి. ఆ పార్టీకి మద్ధతిచ్చే పార్టీలు, వ్యక్తులను కూడా తొలి నుంచి ప్రకాష్ రాజ్ వ్యతిరేకిస్తూ వస్తున్నారు. సామాజిక కార్యకర్త, జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య తర్వాతి నుంచి బీజేపీ అంటే చాలు ఆయన భగ్గుమంటున్నారు. ఈ క్రమంలోనే బీజేపీతో అంగకాగుతోన్న తన మిత్రుడు పవన్ కళ్యాణ్‌ను కూడా విడిచిపెట్టడం లేదు.

Prakash Raj Counter To AP Dy CM Pawan Kalyan s stand on Hindi

పవన్‌ను టార్గెట్ చేస్తోన్న ప్రకాష్ రాజ్
తిరుమలలో కల్తీ లడ్లు, అన్యమత ప్రచారంపై పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. అలాగే సనాతన ధర్మ పరిరక్షణ పేరిట పలు ఆలయాలను కూడా సందర్శించారు. దీంతో పవన్‌ను టార్గెట్‌గా చేసుకుని కౌంటర్లు ఇస్తున్నారు ప్రకాష్ రాజ్. ఆ మధ్య తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్‌ను ఉద్దేశించి పవన్ వ్యాఖ్యలు చేయడంతో.. ఎంజీఆర్‌పై అంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది అంటూ సెటైర్లు వేశారు ప్రకాష్ రాజ్. దీనికి కౌంటర్‌గా ఎంజీఆర్‌పై తాను గతంలో చేసిన కామెంట్స్ తాలుకా వీడియోలను షేర్ చేశారు పవన్.

పవన్‌కు ఏం తెలియదన్న ప్రకాష్‌రాజ్
ఆ తర్వాత బీజేపీతో పవన్ ప్రయాణం .. ముంబైలో లోకల్ ట్రైన్ జర్నీలాంటిదని ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు. పవన్‌కు ఏం తెలియదని, బీజేపీ వాళ్లే ఎక్కించారని.. వాళ్లే దించేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ, జనసేన కేడర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయాల్లోకి వచ్చి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారని.. మీరేం సాధించారని ప్రశ్నించారు. ఓడిపోయిన వారు సైలెంట్‌గా ఉండాలని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి కౌంటరిచ్చారు.

హిందీకి పవన్ మద్ధతు
తాజాగా హిందీకి మద్ధతు ఇచ్చేలా పవన్ కళ్యాణ్ స్టాండ్ తీసుకోవడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో రాజభాష విభాగం స్వర్ణోత్సవ సమ్మేళనం కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ.. హిందీ నేర్చుకోకుంటే మన ఉనికిని కోల్పోమని, మరో భాషని యాక్సెప్ట్ చేస్తే ఓడిపోవడం కాదన్నారు. ఇంగ్లీష్‌ను సొంతం చేసుకున్న మనం.. హిందీని మన భాషగా ఎందుకు భావించడం లేదని పవన్ ప్రశ్నించారు. ఇంట్లో మాట్లాడుకోవడానికి మాతృభాష.. బయట మాట్లాడటానికి హిందీ అవసరమని డిప్యూటీ సీఎం తెలిపారు.

అమ్ముడుపోయావంటూ ప్రకాష్ రాజ్ ఫైర్
పవన్ కళ్యాణ్ హిందీ స్టాండ్‌పై ప్రకాష్ రాజ్ ఘాటుగా స్పందించారు. పవన్ మాట్లాడిన వీడియోను షేర్ చేస్తూ.. 'ఈ range కి అమ్ముకోవడమా ....ఛి...ఛీ... #justasking' అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. జనసేనతో పాటు బీజేపీ కేడర్, పవన్ అభిమానులు పవన్ కళ్యాణ్‌పై మండిపడుతున్నారు. మరి ప్రకాష్ రాజ్ కౌంటర్‌పై పవన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

More from Filmibeat

Read more about: prakash raj pawan kalyan bjp
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X