పీకల్లోతు కష్టాల్లో ప్రకాశ్ రాజ్.. కరాటే కళ్యాణి, బీజేపీ నేత కేసు నమోదు
విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ పీకల్లోతు వివాదంలో కూరుకుపోయారు. హిందూ మతాన్ని, రామయాణాన్ని కించ పరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు అంటూ హిందుత్వ వాదులు భగ్గుమంటున్నారు. పలుచోటు ప్రకాశ్ రాజ్‌పై కేసులు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ, హిందూ నేతలు ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నారు, ఆయనను ఈ విషయంలో కఠినంగా శిక్షించాలి. సినీ పరిశ్రమ నుంచి బహిష్కరించాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదం వెనుక అసలు కారణమేమిటి? అనే వివరాల్లోకి వెళితే..
గత జనవరిలో కేరళలో కేరళ లిటరేచర్ ఫెస్టివల్ జరిగింది. ఆ వేడుకలో పిల్లల చేత రామాయణ నాటకాన్ని మాడర్న్ పద్దతిలో ప్రదర్శించారు. రాముడు, లక్ష్మణుడు, శూర్పణఖ పాత్రలతో నాటకాన్ని ప్రదర్శించారు. అయితే కామెడీ తరహాగా ప్రదర్శిస్తూ పండ్లు, వాటికి ధర చెల్లింపు, జీఎస్టీ అంశాలను ప్రదర్శించారు. ఆ తర్వాత ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ.. శ్రీరాముడు ఉత్తర భారతదేశానికి చెందినవాడు. రావణుడు దక్షిణ భారత్‌కు చెందిన ఒక గిరిజన నాయకుడు. కేవలం పండ్లు దొంగిలించడం వల్లే వారి మధ్య ఘర్షణ మొదలైంది అనే విధంగా కామెంట్స్ చేశారు. పండ్ల ధర చెల్లించే విషయంలో రాముడు, రావణుడి చెల్లెలు శూర్పణఖకు గొడవ జరిగింది అనే విధంగా వ్యాఖ్యలు చేశారు.

అయితే జనవరిలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్పింగులు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అయ్యాయి. దాంతో ఆ అంశం సినీ, రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే శ్రీరాముడిపై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు అంటూ హిందుత్వ వాదులు మండిపడ్డారు. అంతేకాకుండా ఆయనపై కేసులు నమోదు చేశారు.
ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలను ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బీజేపీ నేత, టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాశ్ తీవ్రంగా పరిగణించారు. హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా ఆయన వ్యాఖ్యలుచేశారు. అందుకు ఆయనను కఠినంగా శిక్షించాలి. ప్రకాశ్ రాజ్ చేసిన కామెంట్స్‌ను ఉన్నతాధికారులకు సమర్పించి ఫిర్యాదు చేశారు. దాంతో ఈ వివాదం మరింత సీరియస్‌గా మారే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా, సినీ నటి పడాల కల్యాణి అలియాస్ కరాటే కళ్యాణి కూడా ప్రకాశ్ రాజ్‌పై శివమెత్తారు. ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండించారు. భేషరుతగా క్షమాపణ చెప్పాల్సిందే అంటూ డిమాండ్ చేశారు. అంతేకాకుండా హైదరాబాద్‌లో పంజగుట్టా పోలీస్ స్టేషన్‌లో ప్రకాశ్ రాజ్‌పై ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసును నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications