వారణాసితో నా ఆకలి తీరింది.. రాజమౌళి రుణం తీర్చుకోలేనిది.. ప్రకాశ్ రాజ్ ఎమోషనల్
Varanasi: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) హీరోగా, దర్శక ధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి (S.S.Rajamouli) కాంబోలో తెరకెక్కుతున్న మూవీ వారణాసి( Varanasi). ఈ మూవీ కోసం యావత్ సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్ ఈ సినిమా గ్లోబల్ లెవెల్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా మహేష్ బాబు 'రుద్ర' లుక్ ప్రేక్షకుల్లో గూస్‌బంప్స్ తెప్పించగా, రాజమౌళి ఈ సినిమాను హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడన్న అంచనాలు మరింత పెరిగాయి. ఇలాంటి మూవీ నుంచి ఏ చిన్న బజ్ అయినా సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. తాజాగా విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) చేసిన వ్యాఖ్యలు మహేశ్ బాబు రాజమౌళి అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఇంతకీ ఏమన్నారంటే?
అత్యంత ప్రతిష్టాత్మక సినిమా వారణాసి నుంచి మరో కీలక అప్‌డేట్ బయటికి వచ్చింది. ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందా? లేదంటే కొనసాగుతోందా? అనే అనుమానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వేళ, తాజాగా నటుడు ప్రకాశ్ రాజ్ కీలక ప్రకటన చేశారు. వారణాసి చిత్రంలో తాను కీలక పాత్ర పోషిస్తున్నానని ప్రకాశ్ రాజ్ అధికారికంగా ధృవీకరించారు. అంతేకాదు, ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఒక ముఖ్యమైన షెడ్యూల్ కూడా పూర్తయిందని వెల్లడించారు. అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ లో భాగం కావడంతో తన నట దాహార్తిని తీర్చుతోందని, తన కోరిక నేరవేరిందని పేర్కొన్నారు. దీనిని బట్టి చూస్తే.. వారణాసి సినిమాలో ప్రకాశ్ రాజ్ పాత్ర ఎలా ఉంటుందో, కథలో కీలక మలుపులు ఉండబోతున్నట్టు తెలుస్తోంది.

ఇది రాజమౌళి దర్శకత్వంలో ప్రకాశ్ రాజ్ నటిస్తున్న రెండో సినిమా కావడం విశేషం. ఇంతకుముందు వీరి కాంబినేషన్‌లో వచ్చిన విక్రమార్కుడు (Vikramarkudu) . ఈ మూవీ ప్రేక్షకుల్లో ఇప్పటికీ గుర్తుండిపోయే నిలిచింది. ఆ సినిమా తర్వాత రాజమౌళి తెరకెక్కించిన ఏ చిత్రంలోనూ ప్రకాశ్ రాజ్ కనిపించలేదు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ ఈ క్రేజీ కాంబినేషన్ రిపీట్ కావడం సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. మరోవైపు మహేశ్ బాబు - ప్రకాశ్ రాజ్ కాంబినేషన్ ఇప్పటికే ఎన్నో సినిమాల్లో ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు అదే జోడీ రాజమౌళి మార్క్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాలో కనిపించనుండటంతో ఈ పాత్రల మధ్య వచ్చే సీన్స్ ఎలా ఉండబోతాయన్న ఆసక్తి పెరిగింది.
ఇక స్టార్ కాస్ట్ విషయానికి వస్తే.. ఈ మూవీలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra), మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ( Prithviraj Sukumaran) కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారని ప్రకాశ్ రాజ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. వీరితో పాటు తనకు అవకాశం ఇచ్చినందుకు రాజమౌళి టీమ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వ్యాఖ్యలతో 'వారణాసి' కేవలం పాన్-ఇండియా మూవీ మాత్రమే కాకుండా, ఇంటర్నేషనల్ స్థాయిలో రూపొందుతున్న భారీ ప్రాజెక్ట్ అని మరోసారి నిర్ధారణ అయింది.
రాజమౌళి - మహేశ్ బాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ సినిమా ఓ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్నట్లు ఇప్పటికే సమాచారం. ఈ సినిమా కోసం మహేశ్ బాబు తన లుక్‌ను పూర్తిగా మార్చుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రకాశ్ రాజ్ వంటి టాలెంటెడ్ యాక్టర్స్ కీలక పాత్రలో నటించడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. వారణాసి అనే టైటిల్, భారీ స్టార్ కాస్ట్, రాజమౌళి మేకింగ్ అన్ని కలిసి చూస్తే.. ఈ మూవీ ఇండియన్ సినిమా చరిత్రలోనే అతిపెద్ద ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలవడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


Click it and Unblock the Notifications











