Prakash Raj: అందుకే ప్రశ్నిస్తున్నా .. పవన్ కళ్యాణ్ పై మళ్లీ నోరుపారేసుకున్న ప్రకాశ్ రాజ్
Prakash Raj vs Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి విమర్శలు చేశారు. తిరుమల లడ్డూ కల్తీ వివాదం చేలరేగినప్పటి నుంచి వీరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. సమయం దొరికినప్పడల్లా.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పిస్తున్నారు ప్రకాశ్ రాజ్. ఇలా వీరిద్దరి మధ్య గత కొన్నిరోజులుగా మాటల యుద్ధం నడిచింది. తాజాగా మరో సారి పవన్ పై ప్రకాశ్ రాజ్ షాకింగ్ కామెంట్స్ చేశారు.
తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై ప్రకాష్ రాజ్ రియాక్ట్ అవుతూ.. తిరుమల లడ్డూ కల్తీ వివాదాన్ని ఎందుకు రాజకీయం చేస్తున్నారని, ఇది రాష్ట్ర సమస్య అని, అధికారంలో ఉన్నవారు ఆరోపణలు చేయకుండా, తప్పు చేసిన వారిని శిక్షించాలని, దీనికి మతం రంగు పులుమకూడదని, మత విద్వేషాలు రెచ్చగొట్టకుండా సామరస్యంగా ఈ సమస్యను పరిష్కరించాలంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేయడంతో ఈ రగడ మొదలైంది.

ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ట్వీట్ పై పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవుతూ.. సనాతన ధర్మం గురించి, ఫిల్మ్ ఇండస్ట్రీలో మాట్లాడేవారు సపోర్ట్ గా మాట్లాడాలని, లేకపోతే సైలెంట్ గా ఉండాలంటూ పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలకు హర్ట్ అయిన ప్రకాశ్ రాజ్.. తాను పెట్టిన పోస్టు అర్ధం కాలేదేమో అని మళ్లీ తాను పెట్టిన ట్వీట్ ను మరోసారి చదువుమని కోరుతూ వీడియో పెట్టారు.
అంతటితో ఆగకుండా.. ప్రకాశ్ రాజ్ మరో షాకింగ్ ట్విట్ చేశారు. 'కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ కదా.. ఇక చాలు ప్రజల కోసం చేయవలసిన పనులు చూడండి' అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు ప్రకాశ్ రాజ్. ఆ తరువాత ''గెలిచేముందు ఒక అవతారం... గెలిచిన తర్వాత ఇంకో అవతారం.. ఏంటీ అవాంతరం.. ఏందుకు మనకీ అయోమయం... ఏది నిజం? జస్ట్ ఆస్కింగ్?'' అంటూ ప్రకాశ్ రాజ్ సెటైరికల్ ట్వీట్ చేశారు.
ఇటీవల తమిళనాడులో ఓ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాశ్‌రాజ్ మాట్లాడుతూ.. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌పై ప్రశంసలు కురిపించారు. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సమానత్వం గురించి మాట్లాడుతుంటే.. మరో డిప్యూటీ సీఎం సనాతన ధర్మం అంటూ తన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటూ పరోక్షంగా పవన్ కల్యాణ్‌పై విమర్శలు గుప్పించారు. ఇలా గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇప్పుడు తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ పై ప్రకాశ్ రాజ్ విరుచుకుపడ్డాడు.

తాజాగా నటుడు ప్రకాశ్ రాజ్ ఓ ఇంటర్య్వూలో పాల్గొన్నారు. ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ అంటే మీకు ఎందుకు అంతా కోపమని యాంకర్ ప్రశ్నించగా.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మూర్ఖంగా రాజకీయాలు చేస్తున్నాడు. విధ్వంస రాజకీయాలు తెర తీస్తున్నారు. ఈ విషయం నాకు నచ్చడం లేదు. ఆయనను ఓట్లు వేసిన ఎన్నుకున్నది మతపరంగా విడదీసి, విధ్వంస రాజకీయాలు చేయడానికి కాదు కదా? ఈ విషయాలను ప్రశ్నించడానికి ఒక్కరుండాలి. అదే పనిని నేను చేస్తున్నాను.' అని ప్రకాష్ రాజ్ సమాధానమిచ్చారు.
ప్రస్తుతం ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. అయినా.. వీరి మధ్య మాటల యుద్దానికి ఎప్పుడు తెరపడుతుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











