పవన్ ను వదలని ప్రకాష్ రాజ్.. జస్ట్ ఆస్కింగ్ అంటూ మరోసారి ట్వీట్
Tirupati laddu row: తిరుపతి లడ్డు వివాదం దగ్గర నుంచి మొదలైన ప్రకాష్ రాజ్ ట్వీట్ల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. సనాతన ధర్మం గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడిన ప్రతిసారి కూడా ప్రకాశ్ రాజ్ విమర్శించడం మొదలు పెట్టారు. తొలుత అధికారంలో ఉన్నవారు ఆరోపణలు చేయకుండా, తప్పు చేసిన వారిని శిక్షించాలని, దీనికి మతం రంగు పులుమకూడదని, మత విద్వేషాలు రెచ్చగొట్టకుండా సామరస్యంగా ఈ సమస్యను పరిష్కరించాలంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేయడంతో రగడ మొదలైందని చెప్పాలి.
ఈ ట్వీట్ పై పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవుతూ.. సనాతన ధర్మం గురించి, ఫిల్మ్ ఇండస్ట్రీలో మాట్లాడేవారు సపోర్ట్ గా మాట్లాడాలని, లేకపోతే సైలెంట్ గా ఉండాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. ఈ కామెంట్స్ హర్ట్ అయిన ప్రకాశ్ రాజ్.. తాను పెట్టిన పోస్టు అర్ధం కాలేదేమో అని మళ్లీ తాను పెట్టిన ట్వీట్ ను చదవమని కోరుతూ వీడియో పెట్టారు. ఇలా పవన్ ప్రతి మాటకు కూడా తనదైన రీతిలో కౌంటర్ ఇస్తూ వస్తున్నారు ప్రకాశ్ రాజ్. ఇక తిరుపతి లడ్డు వివాదంలో సుప్రీంకోర్టుకు వెళ్లడంతో కూటమి ప్రభుత్వం కూడా సైలెంట్ అయింది.

ఈ క్రమంలో ప్రకాశ్ రాజ్ మరో ట్విట్ చేశారు. 'కొత్త భక్తుడికి పొంగ నామాలు ఎక్కువ కదా.. ఇక చాలు ప్రజల కోసం చేయవలసిన పనులు చూడండి' అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు ప్రకాశ్ రాజ్. ఇక గురువారం తిరుపతిలో జరిగిన వారాహి డిక్లరేషన్ సభలో సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ సుదీర్ఘ ప్రసంగం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సభలో సనాతన ధర్మ పరిరక్షణ కోసం కేంద్రానికి పలు సూచనలు చేస్తూ కూడా దానికి సంబంధించిన డిక్లరేషన్లు విడుదల చేశారు పవన్ కళ్యాణ్. అయితే ఇతర మతాలను కించపరిస్తే నటులు చిత్ర పరిశ్రమ, చిత్ర పరిశ్రమకు సంబంధించిన వారు, ఇతర వ్యాపార ప్రముఖుల అందరూ మాట్లాడుతారు.
కానీ, ఇలాంటి చర్యల వల్ల చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. కానీ, సనాతన ధర్మంపై దాడులు జరిగితే మాత్రం ఒక్కరు కూడా స్పందించడం లేదంటూ ఆరోపించారు. పవన్ కళ్యాణ్ తిరుపతిలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ. తన ప్రాణాలు పోయేంత వరకూ తాను సనాతన ధర్మాన్ని కోసం పోరాడుతాననీ, తాను సనాతన ధర్మాన్ని పాటిస్తే అవహేళన చేశారు. అలాంటి వారికి చెప్తున్నా.. తాను సనాతని హిందువుని. కానీ, తాను ఇస్లాం, క్రిస్టియన్స్,బుద్ధిజంను కూడా గౌరవిస్తాను. సనాతన ధర్మాన్ని అంతం చేస్తానంటున్న సెక్యులరిస్టులకు మరోసారి హెచ్చరిస్తున్న అని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్.

ఈ వ్యాఖ్యలపై మరోసారి ప్రకాష్ రాజ్ కౌంటర్ వేశాడు. ' సనాతన ధర్మ రక్షణలో మీరు ఉండండి . సమాజ రక్షణలో మేము ఉంటాము. జస్ట్ ఆస్కింగ్ ఆల్ ది బెస్ట్' అంటూ మరోసారి షాకింగ్ ట్వీట్ చేశారు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. దీంతో ప్రకాష్ రాజ్ ట్వీట్ చక్కర్లు కొడుతోంది. వీరి మధ్య మాటల యుద్ధం ఎక్కడి వరకు వెళ్తుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











