శ్రీ రాముడిపై ప్రకాశ్ రాజ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు.. భగ్గుమంటోన్న హిందూ సంఘాలు

విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నటనతో పాటు సామాజిక, రాజకీయ అంశాలపై బహిరంగంగా స్పందించే వ్యక్తిగా కూడా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి (BJP), కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ తరచూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. అలాగే పబ్లిక్ ఈవెంట్స్‌లోనూ తన అభిప్రాయాలను నేరుగా వ్యక్తం చేస్తుంటారు.

ఇటీవల ఆయన మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. కేరళలో జరిగిన కేరళ సాహిత్యోత్సవ వేదిక నటుడు ప్రకాష్ రాజ్ చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆయన రామాయణం (Ramayana) గురించి చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చకు దారి తీసాయి. దీంతో హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే?

Prakash Raj Ramayana Remarks Spark Row Hindu Groups Demand Action Nationwide

రామాయణంపై వివాదాస్పద వ్యాఖ్యలు
ఇటీవల కేరళ సాహిత్యోత్సవ వేదిక పై జరిగిన 'తూలిక పాలిటిక్స్' (వ్యంగ్య రాజకీయాలు) అనే కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాష్ రాజ్ ప్రసంగానికి సంబంధించిన ఒక వీడియో క్లిప్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ముఖ్యంగా శ్రీరామ నవమి సందర్భంగా ఈ వీడియో బయటకు రావడం మరింత సెన్సిటివ్‌గా మారింది. ఆ వీడియోలో ఆయన రామాయణ కథను తనదైన శైలిలో వ్యంగ్యంగా చెప్పడానికి ప్రయత్నించారు. కానీ అదే ఇప్పుడు పెద్ద వివాదానికి కారణమైంది.

ప్రకాష్ రాజ్ తన స్పీచ్‌లో శ్రీరాముడు, లక్ష్మణుడు భారతదేశం నుండి వచ్చిన వలస కూలీలుగా చూపిస్తూ, వారు దక్షిణ భారతదేశంలోని ఒక పొలంలోకి వెళ్లి పండ్లు దొంగిలించి, అనుమతి లేకుండా తిన్నారని చెప్పడం వివాదాస్పదంగా మారింది. ఆ పొలం యజమాని రావణుడితో జరిగిన గొడవను కూడా వ్యంగ్యంగా వివరించారు. రావణుడు ఒక దక్షిణ భారత గిరిజనుడని, ఆ పండ్ల దొంగతనంపై ప్రశ్నించినప్పుడు అది కాస్తా పెద్ద వివాదంగా మారిందని, ఆఖరికి ఆ గొడవ రూ .2000 జీఎస్టీ బిల్లు చుట్టూ తిరుగుతూ యుద్ధానికి దారితీసిందంటూ ప్రకాశ్ రాజ్ కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు చాలా మందికి మతపరమైన భావోద్వేగాలను దెబ్బతీసేలా అనిపించాయి.

హిందూ సంఘాల ఆగ్రహం
ఈ వ్యాఖ్యలపై పలు హిందూ సంఘాలు తీవ్రంగా స్పందించాయి. వారు ఇది కేవలం సెటైర్ కాదు, హిందూ దేవుళ్లను అవమానించడం మాత్రమే కాకుండా దేశంలో ఉత్తర-దక్షిణ విభజనకు కారణమయ్యే విధంగా ఉంది. సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా భారీగా రియాక్ట్ అవుతూ, ప్రకాష్ రాజ్ పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయనపై కొందరు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు, మరికొందరు ఆయనను "యాంటీ-హిందూ"గా విమర్శిస్తున్నారు. 'హిందువులను అపహాస్యం చేయడానికి ప్రకాష్ రాజ్ రామాయణాన్ని కల్పిత కథగా అల్లి చెప్పారు. కేవలం గోమాంస వినియోగాన్ని ప్రోత్సహించడానికి, ఉత్తర-దక్షిణ రాష్ట్రాల మధ్య అగాథాన్ని సృష్టించడానికే ఈ కామెంట్స్ చేశారు. ఇకపై సినిమాల్లో అతనికి అవకాశాలు ఇవ్వకుండా దర్శక నిర్మాతలు చర్యలు తీసుకోవాలి' అని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

ఈ వివాదం ఆయన సినీ కెరీర్‌పై కూడా ప్రభావం చూపేలా ఉంది. ముఖ్యంగా దృశ్యం 3 నుంచి ఆయనను తొలగించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అలాగే రాజమౌళి తెరకెక్కిస్తున్న "వారణాసి" ప్రాజెక్ట్ నుంచీ కూడా ఆయనను తీసేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. "ప్రకాశ్ రాజ్ ఉంటే సినిమాలు బాయ్ కాట్ చేస్తాం" అంటూ సోషల్ మీడియాలో అల్టిమేటంలు కూడా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే షూటింగ్‌లు, ప్రమోషన్స్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది. సాధారణంగా తనపై వచ్చే విమర్శలకు వెంటనే స్పందించే ప్రకాష్ రాజ్, ఈసారి మాత్రం ఇంకా స్పందించకపోవడం. ఇది ఈ వివాదంపై మరింత ఆసక్తిని పెంచుతోంది.

Read more about: prakash raj bjp ramayana
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X