పవన్ కళ్యాణ్ సినిమాలో రాజకీయ విరోధి.. పవర్ఫుల్ క్రేజీ సీన్స్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో ఓజీ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతూ ఉంది. గ్యాంగ్ స్టార్ కథాంశంతో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్ ఈ మూవీలో పవన్ కళ్యాణ్ కి జోడిగా నటిస్తోంది.

వరుస సినిమాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ మూవీకి సంబంధించిన కీలక షెడ్యూల్ ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇది కంప్లీట్ అయిన తర్వాత మరల ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో జాయిన్ అవ్వబోతున్నారు. ఇక ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ రాజకీయ విరోధి కనిపించబోతున్నాడు. ఆయనతో ఇదివరకే చాలాసార్లు పవన్ పాలిటిక్స్ పరంగా విమర్శలు ఎదుర్కొన్నారు. అతను మరెవరో కాదు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ప్రకాష్ రాజ్.

Prakash raj special role in Pawan kalyan upcoming movie OG

స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రకాష్ రాజ్ OG లో కీలక పాత్రలో నటించబోతున్నారు. తాజాగా ఆయన ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఈ విషయాన్ని నిర్మాత డివివి దానయ్య ట్విట్టర్ ద్వారా తన ప్రొడక్షన్ హ్యాండిల్ నుంచి పోస్ట్ చేసి కన్ఫర్మ్ చేశారు. ప్రకాష్ రాజ్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో కీలక సన్నివేశాలు షూటింగ్ జరుగుతున్నాయని తెలియజేశారు. ఇక ప్రకాష్ రాజ్ పాత్ర సినిమాలో చాలా కృషియల్ గా ఉంటుందని తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ కాంబినేషన్ అంటే ఓ విధంగా టాలీవుడ్ లో సెన్సేషన్ అని చెప్పాలి. వారిద్దరి కాంబో సీక్వెన్స్ ప్రతి సినిమాలో కూడా సూపర్ హిట్ అయ్యాయి. బద్రి సినిమా నుంచి మొదలుపెడితే కెమెరామెన్ గంగతో రాంబాబు, రీసెంట్ గా వకీల్ సాబ్ మూవీస్ లో ప్రకాష్ రాజ్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ సీక్వెన్స్ ఫ్యాన్స్ ని విజిల్స్ వేయించాయి.

Prakash raj special role in Pawan kalyan upcoming movie OG

మరోసారి ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ మూవీలో వీరిద్దరి మధ్య అలాంటి క్రేజీ సీక్వెన్స్ ని దర్శకుడు సుజిత్ డిజైన్ చేశాడని తెలుస్తోంది. మరి ఈ సన్నివేశాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు సర్వత్ర ఆసక్తి నెలకొంది. కళ్యాణ్ ఈ సినిమాని వీలైనంత వేగంగా కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. దీనికోసం ఫారిన్ షెడ్యూల్స్ కూడా సుజిత్ ప్లాన్ చేస్తూ ఉండడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X