twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ATMAA మంచు విష్ణుకు షాక్.. రెండుగా చీలిపోనున్న మా.. రాజీనామా యోచనలో సభ్యులు..కొత్త సంఘం పేరంటంటే?

    |

    మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడిన తర్వాత కూడా ఆ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానల్స్ మధ్య హోరాహోరీగా జరిగిన సంగతి తెలిసిందే.. అయితే ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు పోటీగా మరో అసోసియేషన్ వచ్చే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.. వివరాల్లోకి వెళితే

    ప్రకాష్ రాజ్ అలా

    ప్రకాష్ రాజ్ అలా

    టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో మంచు విష్ణు ఫైనల్ గెలిచిన సంగతి తెలిసిందే అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నిక కాగా ఆయన ప్యానల్ నుంచి దాదాపు పది మంది గెలిచారు.. ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి ఎనిమిది మంది గెలిచారు. అయితే ప్రాంతీయ వాదం తీసుకొచ్చి ప్రకాష్ రాజ్ గెలిపించ లేదు అనే ఉద్దేశంతో మెగా బ్రదర్ నాగబాబు ఫలితాలు వెలువడిన వెంటనే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రకాష్ రాజ్ కూడా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తాను రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. మరో నటుడు మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా కూడా 15రోజులు అల్టిమేటం జారీ చేస్తున్నానని నరేష్ హయాంలో జరిగిన అవకతవకలు తేల్చకపోతే తాను రాజీనామా చేస్తానని వెల్లడించారు.

    విష్ణు ఇలా

    విష్ణు ఇలా

    ఇదంతా ఇలా జరుగుతూ ఉంటే కొత్త అధ్యక్షుడు మంచు విష్ణు మాత్రం మేమందరం ఒకటేనని 'మా'కు వాళ్ళ సలహాలు కూడా కావాలని నాగబాబు గారి రాజీనామా కానీ ప్రకాష్ రాజ్ గారి రాజీనామా కానీ ఆమోదించడం లేదని చెబుతున్నారు..శివాజీ రాజా రాజీనామా చేస్తానంటే ఇంటికెళ్లి కొరుకుతా అని వ్యంగ్యంగా కామెంట్ చేస్తున్నారు. అయితే మంచు విష్ణుకు ప్రకాష్ రాజ్ చేసిన మెసేజ్ కూడా బహిర్గతం చేసిన క్రమంలో నిన్న రాత్రి మరోసారి ట్వీట్ చేశాడు ప్రకాశ్ రాజ్. ''మా వెంట నిలిచిన 'మా' సభ్యు లందరికీ.. నేను రాజీనామా చేయడానికి ఓ లోతైన అర్థం ఉంది. త్వరలో ఆ కారణాన్ని వివరిస్తాను''మీరు గర్వపడతారు అంటూ ట్వీట్‌ చేశారు.

    ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా

    ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా

    నిజానికి ప్రకాష్ రాజ్ తెలుగు వాడే దంటూ మంచు విష్ణు ప్యానెల్ కు అండగా నిలిచిన వాళ్లంతా కామెంట్ చేయడం ప్రకాష్ రాజ్ ను బాధించింది. అదే విషయాన్ని.. మా.. ఎన్నికల ఫలితాలు వెల్లడైన మరుసటి రోజు మీడియా సమావేశంలో ప్రకాష్ చెప్పుకొచ్చారు. ఇలాంటి అజెండాతో, ఐడియాలజీతో ఉన్న అసోసియేషన్‌లో సభ్యుడిగా ఉండలేనని, మా అసోసియేషన్‌కి తెలుగువాడు కాని నా సేవలు వద్దని తీర్పు ఇచ్చారు కాబట్టి 'మా' లోపలికి రావొద్దని తీర్పు ఇచ్చిన తర్వాత కూడా నేను ఎలా వెళ్ళగలను? కళాకారుడిగా నాకు ఓ ఆత్మ గౌరవం ఉంటుంది.. కాబట్టి 'మా' ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానాని ప్రకటించారు.

    మా'కి మెగా ఫ్యామిలీ నుంచి మరో ప్రత్యామ్నాయం

    మా'కి మెగా ఫ్యామిలీ నుంచి మరో ప్రత్యామ్నాయం

    ఇండస్ట్రీలో మేమంతా ఒక్కటే అనే అబద్ధాన్ని నమ్మను అన్న ప్రకాశ్ రాజ్ తాజా ట్వీట్ కొత్త అనుమానాలు మొదలయ్యేలా చేసారు. ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు నాగబాబు కౌంటర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారని అంటున్నారు. ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి సపోర్ట్ చేసే వారితో కొత్త సంఘం మరో సంఘాన్ని స్థాపించబోతున్నారని.. ఆ సంఘానికి ప్రకాష్ రాజ్ ని ఏకగ్రీవ అధ్యక్షుడిగా ఎన్నుకోబోతున్నారని అంటున్నారు. అయితే చిరంజీవి ఫౌండర్ ప్రెసిడెంట్ గా ఉన్న 'మా'కి మెగా ఫ్యామిలీ నుంచి మరో ప్రత్యామ్నాయం అంటే జరిగే పనేనా అనే అనుమానాలు కూడా ఉన్నాయి.

    Recommended Video

    Anubhavainchu Raja Song Launched By Naga Chaitanya | Raj Tarun
    'మా'కు పోటీగా ATMAA

    'మా'కు పోటీగా ATMAA

    ఇక గెలిచిన, ఓడిపోయిన తన ప్యానెల్‌ సభ్యులతో ప్రకాష్‌రాజ్‌ చర్చలు జరుపుతున్నారని, 'మా'కు పోటీగా ATMAA (ఆల్‌ తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేన్‌)? ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారని అంటున్నారు. ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన ఎనిమిది మంది రాజీనామాలు చేసి కొత్త అసోసియేషన్ లో చేరే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో సాయంత్రం 5 గంటలకు ప్రకాశ్ రాజ్ ప్యానెల్ ప్రెస్‌మీట్‌ నిర్వహిస్తుండటంతో వారు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారోనని సినీ వర్గాలతో పాటు ప్రజలు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు.

    English summary
    as per reports, Prakash raj is going to start all telugu movie artist association.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X