SSMB28: మహేశ్ బాబు తాతగా స్టార్ యాక్టర్.. అప్పుడు విలన్‌గా, తండ్రిగా.. ఇప్పుడిలా!
యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ అన్నింటికి మించి హ్యాండ్సమ్ లుక్స్‌తో తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని స్టార్ హీరోగా సత్తా చాటుతోన్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఆ మధ్య వరుసగా మూడు విజయాలను ఖాతాలో వేసుకుని సత్తా చాటిన అతడు.. 'సర్కారు వారి పాట'తో మాత్రం ఆశించిన స్థాయి విజయాన్ని సొంతం చేసుకోలేకపోయాడు. అయినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఆ వెంటనే మహేశ్ బాబు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమాను మొదలెట్టాడు. దీంతో దీనిపై అంచనాలు ఏర్పడ్డాయి.
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తోన్న ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ గత ఏడాదే ప్రారంభం అయింది. ఫస్ట్ షెడ్యూల్‌లో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేసుకున్నారు. అలాగే, రెండో షెడ్యూల్‌ను కూడా చిత్ర యూనిట్ ఇప్పటికే కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం మహేశ్ బాబు వెకేషన్‌కు వెళ్లి రాగా.. యూనిట్ మాత్రం హైదరాబాద్‌లో భారీ సెట్‌ను నిర్మిస్తోంది. ఇది పూర్తైన వెంటనే షూట్ మొదలెట్టి.. ఏకధాటిగా మొత్తం కంప్లీట్ చేసే ప్లాన్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి మరో ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది.

క్రేజీ కాంబోలో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ క్రేజీ మూవీలో ఎంతో మంది స్టార్లు భాగం కాబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే ఒక్కక్కరి పేర్లు బయటకు వస్తున్నాయి.. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ సినిమాలో స్టార్ యాక్టర్ ప్రకాశ్ రాజ్ నటిస్తున్నట్లు తాజాగా ఓ న్యూస్ లీకైంది. అంతేకాదు, ఇందులో ఆయన మహేశ్ బాబుకు తాత పాత్రను చేస్తున్నారని తెలిసింది. దీంతో ఈ రోల్‌పై ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా.. గతంలో మహేశ్ బాబుకు విలన్‌గా, తండ్రిగా చేసిన ప్రకాశ్ రాజ్ ఇందులో ఎలా ఆకట్టుకుంటారో చూడాలి.
ఇక.. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించే ఈ చిత్రాన్ని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీల ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. ఇక, దీనికి 'అర్జునుడు', 'అతడే పార్థు' వంటి టైటిళ్లు పరిశీలనలో ఉన్నాయి. దీన్ని ఆగస్టు 11, 2023న రిలీజ్ చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











