Prakash Raj : డెవిల్ ఈజ్ బ్యాక్, హాస్పిటల్ బెడ్ మీద నుంచే అలా ఫేస్ పెట్టి!

గత కొద్ది రోజులుగా సినీనటి సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఆయన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల విషయంలో కలకలం రేపుతూ వస్తున్నా సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన గాయపడి మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. చెన్నైలో ధనుష్ సినిమా షూటింగ్ లో పాల్గొన్న ప్రకాష్ రాజ్ సెట్లో గాయాలపాలయ్యారు. దీంతో ఆయన చేతికి ఫ్రాక్చర్ అన్నట్లుగా ఆయన తాజాగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ప్రకాష్ రాజ్ స్వయంగా ఈ సమాచారాన్ని ట్విట్టర్‌లో వెల్లడించారు. దీని కోసం తాను కూడా శస్త్రచికిత్స చేయించుకోవాల్సి ఉంటుందని ఆయన అభిమానులకు చెప్పారు. అయితే, అతను బాగానే ఉన్నానని యపడాల్సిన పని లేదని కూడా చెప్పారు. ప్రకాష్ రాజ్ చేసిన ఈ ట్వీట్‌లో, ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

కొంతమంది అతని కోసం ప్రార్థిస్తున్నట్లు కూడా పేర్కొన్నారు. అంతేగాక తాను తన స్నేహితుడైన డాక్టర్ గురువారెడ్డి దగ్గరికి వస్తున్నానని త్వరలోనే సర్జరీ చేయించుకుని మళ్లీ సెట్ అవుతానని కూడా వెల్లడించారు.. ఆ పోస్ట్ పెట్టి ఒక రోజు కూడా గడవక ముందే ఆయన మరో పోస్టుతో అభిమానుల ముందుకు వచ్చారు. ది డెవిల్ ఇస్ బ్యాక్, సర్జరీ విజయవంతమైంది నా స్నేహితుడు డాక్టర్ గురవారెడ్డికి, నా కోసం ప్రార్థించిన అందరికీ ధన్యవాదాలు త్వరలోనే యాక్టింగ్ చేస్తూ మీ ముందుకు వస్తాను అంటూ ఆయన తన సోషల్ మీడియా ద్వారా విషయం వెల్లడించారు. అంతేకాక ఇక ఒక హాస్పిటల్ బెడ్ మీద నుంచి ఉన్న సెల్ఫీ ఫోటో కూడా ప్రకాష్ రాజ్ షేర్ చేశారు. ఇక ఈ సెల్ఫీ ఫోటో ద్వారా ఆయన ఎడమ భుజానికి కట్టు వేసి ఉన్నాయి. దీంతో ఆయన ఎడమ చేతికి గాయం అయినట్లు ఈ ఫోటో ద్వారా క్లారిటీ వస్తుంది.

 Prakash raj tweets that he is back after a surgery

ఇక ప్రకాష్ రాజ్ మా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ ఉండటంతో ఆయన ఏం చేసినా అది వివాదాస్పదంగా అలాగే వార్తల్లోకి ఎక్కుతుంది. మరీ ముఖ్యంగా ఆయన ఎన్నికల్లో బరిలోకి దిగడంతో లోకల్ నాన్ లోకల్ విషయం కూడా తెరమీదకు వచ్చింది. ఇక సినిమాల విషయానికి వస్తే ఆయన చేతిలో ఇప్పుడు ప్రస్తుతానికి మంచి సినిమాలే ఉన్నాయి. తెలుగులో అయితే ఆయన మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సర్కారువారు పాట అనే సినిమాలో నటిస్తున్నాడు. మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత కథ నేపథ్యంలో తెరకెక్కిన మేజర్ సినిమాలో అలాగే కన్నడ భాషలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచిన కే జి ఎఫ్ సినిమా సీక్వెల్ కే జి ఎఫ్ టు సినిమాలో అలాగే పుష్ప సినిమాలో, రజనీకాంత్ నటిస్తున్న అన్నాత్తే సినిమాలో ఆయన కనిపించబోతున్నారు. ఇక మరో పక్క రంగమార్తాండ అనే సినిమా చేస్తున్నాడు. ప్రకాష్ రాజ్ చిరకాల మిత్రుడు అయిన కృష్ణవంశీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే ధనుష్ హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్ లో ఆయన గాయపడ్డారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X