ప్రకాష్ రాజ్ కూడా వెబ్ సిరీస్‌ల వైపే.. బడా నిర్మాతతో తొలి అడుగు..
భవిష్యత్తు ఓటీటీలదే అంటూ ఇటీవల చాలా మంది సినీ ప్రముఖులు కామెంట్స్ చేశారు. కరోనా ధాటికి సినిమా ఇండస్ట్రీలో ఉహీంచని మార్పులు అయితే చోటు చేసుకుంటున్నాయి. రానున్న రోజుల్లో థియేటర్స్ సంఖ్య తగ్గే అవకాశం ఉందని కూడా టాక్ వచ్చింది. ఇక నటీనటులు కూడా ఇప్పుడు అప్డేట్ అవుతున్నారు. వెబ్ సిరీస్ లను కూడా ముందుగానే అలవాటు చేసుకుంటున్నారు.
మొన్నటివరకు ఓ వర్గం నటీనటులు మాత్రమే వెబ్ సిరీస్ లలో నటించేవారు. కానీ ఇప్పుడు సీనియర్ యాక్టర్స్ కూడా వెబ్ సిరీస్ ల వైవు అడుగులు వేస్తున్నారు. త్వరలో ప్రకాష్ రాజ్ కూడా ఒక ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ గా ఇప్పుడిప్పుడే మంచి గుర్తింపు దక్కించుకుంటున్న అనిల్ సుంకర ఆ వెబ్ సిరీస్ ని నిర్మించబోతున్నారట.

నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఆ వెబ్ సిరీస్ కథ ఉంటుందట. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను ఫినిష్ చేసుకున్న నిర్మాత ప్రకాష్ రాజ్ కి కథ చెప్పి మెప్పించినట్లు తెలుస్తోంది. టైమ్ చూసి ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. త్వరలోనే వెబ్ సిరీస్ కి సంబంధించిన టైటిల్ ని అలాగే నటీనటుల వివరాలను అఫీషియల్ గా ఎనౌన్స్ చేయనున్నారు. మరి తొలి వెబ్ సీరీస్ తో ప్రకాష్ రాజ్ ఎంతవరకు ఆకట్టుకుంటారో చూడాలి.


Click it and Unblock the Notifications











