twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెగా ఫ్యామిలీకి జీవిత యాంటీ..అందుకే పోటీ అన్న బండ్ల.. ఆల్ ది బెస్ట్ చెప్పిన ప్రకాష్ రాజ్!

    |

    టాలీవుడ్‌ లో మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు ప్రస్తుతం హాట్‌ టాపిక్‌ గా మారాయి. ఎన్నికల వేడి మొదలయిన నాటి నుంచి ప్రకాశ్‌ రాజ్‌కు మద్దతు ఇస్తూ.. ఆయన ప్యానల్‌ లో సభ్యుడుగా ఉన్న బండ్ల గణేశ్‌ యూటర్న్‌ తీసుకుసుని, తాను ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ నుంచి తప్పుకుంటున్నానని, ప్యానల్‌ అధికార ప్రతినిధిగా కొనసాగలేనని ప్రకటించి సంచలనం రేపారు. అంతే కాదు ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ లో జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తున్నజీవితా రాజశేఖర్‌ కి వ్యతిరేకింగా పోటీలోకి దిగుతున్నానంటూ వెల్లడించాడు. ఈ వ్యవహారానికి సంబంధించి ప్రకాష్ రాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

    ప్రకాష్ రాజ్ కి మొట్టమొదటి షాక్

    ప్రకాష్ రాజ్ కి మొట్టమొదటి షాక్

    మా ఎన్నికల్లో బలమైన ప్యానల్ గా పేరు సంపాదించిన ప్రకాష్ రాజ్ కి మొట్టమొదటి షాక్ తగలింది. మొన్నటి దాకా ప్రకాష్ రాజ్ ప్యానెల్‌కు బలమైన పిల్లర్ గా నిలబడిన బండ్ల గణేష్ ఈ షాకిచ్చారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్‌లో పోటీ చేస్తారాని భావిస్తూ వచ్చిన బండ్లను పక్కన పెట్టడంతో అలిగిన ఆయన తాను స్పోక్స్ పర్సన్‌గా పని చేయను, దానికి వేరే వాళ్లను చూసుకోండని ప్రకాష్ రాజ్‌కు బండ్ల గణేష్ షాకిచ్చారు. అయితే ఇక్కడితో బండ్ల గణేష్ వదిలేయకుండా.. జనరల్ సెక్రటరీకి పోటీ చేయబోతోన్నాను అంటూ కొత్త రచ్చ రేపారు.

    చానల్ లైవ్ లో

    చానల్ లైవ్ లో

    ఈ మేరకు వరుస ట్వీట్లు చేసిన సమయానికి ప్రకాష్ రాజ్ ఒక చానల్ లైవ్ లో ఉన్నారు. ఈ క్రమంలో బండ్ల గణేష్ ను లైన్ లోకి తీసుకుని యాంకర్ ప్రశ్నించగా జీవిత రాజశేఖర్ వలనే తను పోటీ చేస్తున్నాను అని ఆయన పేర్కొన్నారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్‌కు మద్దతు ఇస్తానని, ఆయన అధ్యక్షుడు గెలుస్తాడు.. నేను జనరల్ సెక్రటరీగా గెలిచి వస్తాను అని బండ్ల గణేష్ చానల్ లైవ్ లో చెప్పుకొచ్చారు.

    మనస్సాక్షి ఒప్పుకోకపోవడంతో

    మనస్సాక్షి ఒప్పుకోకపోవడంతో

    అయితే బండ్ల గణేష్ ఎందుకు జనరల్ సెక్రటరీ పోస్ట్‌కు పోటీ చేస్తున్నారు అని ప్రశ్నించగా మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా, చిరంజీవి మీద గతంలో jeevitha ఆరోపణలు చేసిందని అందుకే ఆమె తనకు నచ్చదని చెబుతూ అందుకే ఆమె మీద పోటీకి దిగానని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు. ప్యానల్‌లో ఆమెను తీసుకోవడం కూడా నచ్చలేదని, రాత్రంతా కూడా నిద్రపట్టలేదని, నిద్రపోతే ఆమె గుర్తువచ్చిందని, ఆమెకు ఎలా ఓటు వేయాలి? నేను ఓటు వేయాలా? అని ఆలోచించాను. నా మనస్సాక్షి ఒప్పుకోకపోవడంతో అందుకే ఆమెకు వ్యతిరేకంగా పోటీగా దిగాను అని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు.

     మనస్సాక్షి ఒప్పుకోకపోవడంతో

    మనస్సాక్షి ఒప్పుకోకపోవడంతో

    అయితే యాంకర్ ఇంకా బండ్ల గణేష్ ను ఇబ్బంది పెట్టె ప్రయత్నం చేయడంతో దానిని వారించిన ప్రకాష్ రాజ్, ఆయన తన స్పందన వ్యక్తం చేశారు. బండ్ల గణేష్ తన మనస్సాక్షి మేరకు అది చెప్పినట్టు పోటీ చేస్తున్నారు అని పేర్కొన ఆయన జీవిత అనుభవంతో పోటీ చేస్తున్నారు.. నేను అందరినీ సంతృప్తి పరచలేను.. అలా అంటే తొమ్మిది వందల పోస్ట్‌‌లు ఉండాలని అంటూ షాకిచ్చాడు. ఇక బండ్ల గణేష్‌కు పోటీ చేసేందుకు అన్ని రకాల హక్కులున్నాయి అంటూ ప్రకాష్ రాజ్ అన్నారు.

    జీవిత వ్యతిరేకం

    జీవిత వ్యతిరేకం

    మెగా ఫ్యామిలీకి జీవిత వ్యతిరేకం అనే విషయం మీద మీరు పోటీ చేస్తున్నారు, మరి అదే మెగా ఫ్యామిలీ ఈ ప్యానల్ కి మద్దతు ఇస్తున్నారు కదా ? అని లాజిక్ మాట్లాడారు యాంకర్, అయితే దానికి కూడా బండ్ల ఆసక్తికరంగా స్పందించారు. వాళ్ళకి అనిపించింది అదని, నాకు అనిపించింది ఇదని అన్నారు. ఇక ప్రకాష్ రాజ్ బండ్ల పోటీ చేయడానికి సమర్ధుడు అని అందుకే ఆయన పోటీ చేస్తే తప్పేంటి అని ప్రశ్నించగా, అది మా ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ అంటే అని మురిసిపోయాడు. ఇక బండ్ల తమ మనిషే అని ఆయన చెప్పుకొచ్చారు.

    Recommended Video

    Director Shiva Ganesh Speech At Batch Movie Trailer Launch
    మాకేం విభేదాలు లేవు

    మాకేం విభేదాలు లేవు

    ఇక ఈ విషయంలో బండ్ల గణేశ్‌ చేసిన వ్యాఖ్యలపై జీవిత స్పందించారు. తాజాగా ఆమె అదే చానల్‌ లైవ్ లో మాట్లాడుతూ..బండ్ల గణేశ్‌తో తనకెలాంటి విభేదాలు లేవని అన్నారు. . 'మా'లో సభ్యులుగా ఉన్న వారు ఎవరైనా సరే ఎన్నికల్లో పోటీ చేయవచ్చని ఆమె క్లారిటీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో తాను గెలిచినా లేదా ఓడినా 'మా' అభివృద్ధికి పనిచేసే తీరుతామన్నారు.

    బండ్ల గణేశ్‌ కూడా 'మా' అభివృద్ది కోసం పోటీ చేస్తున్నట్టు భావిస్తున్నానని, అంతేగాని తనకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్నారు అని నేను అనుకోవడం లేదన్నారు. ఇక అక్టోబ‌ర్ 10న మా ఎన్నికలు జరగాల్సి ఉండగా.. గత రెండు మూడు నెలలుగా మా ఎలక్షన్స్ వ్యవహారం నడుస్తూనే ఉంది. పోటీదారులు ఒకరి మీద ఒకరి చేసుకుంటున్న చేస్తున్న కామెంట్స్‌తో ఈ ఇష్యూ హాట్ టాపిక్ అయింది. ఇక ఈ ఎన్నికల్లో మంచు విష్ణు, సీవీఎల్ నరసింహారావు, కాదంబరి కిరణ్ లు కూడా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు. మరి వారిలో ఎవరి గెలుస్తారు? అనే విషయం పక్కన పెడితే ఈ ప్రక్రియ మొత్తం సంచలనంగా మారింది అని చెప్పక తప్పదు. మరి చూడాలి ఏం జరగబోతోంది అనేది.

    English summary
    In a live interaction prakash raj wishes bandla ganesh about his contesting as general secretary.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X