పవన్ ఫ్యాన్స్‌కు గూస్‌బమ్స్ తెప్పించే న్యూస్.. అతడి కెరీర్‌లోనే బెస్ట్ ఇంట్రో!
గతంలో కంటే రీఎంట్రీలో వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. 'వకీల్ సాబ్' అనే చిత్రంతో కమ్‌బ్యాక్ అయిన అతడు.. గత ఏడాది 'భీమ్లా నాయక్' అనే మూవీతో ప్రేక్షకులను అలరించాడు. వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్టులను కూడా ప్రకటించాడు. ఇప్పుడు వీలును బట్టి ఆయా సినిమాల షూటింగ్‌లలో పాల్గొంటూ వస్తున్నాడు. ఇక, ఇప్పుడు పవన్ కల్యాణ్ చేస్తున్న అన్ని చిత్రాల్లో హైలైట్ అవుతోంది మాత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే చెప్పాలి. దీనికి కారణం దీన్ని హరీశ్ శంకర్ తీస్తుండడమే.
'వకీల్ సాబ్' మూవీ చేస్తోన్నప్పుడే పవన్ కల్యాణ్ 'గబ్బర్ సింగ్' వంటి భారీ విజయాన్ని అందించిన హరీశ్ శంకర్‌తోనూ 'భవదీయుడు భగత్ సింగ్' అనే సినిమా ప్రకటించాడు. కానీ, ఈ మూవీని మాత్రం పట్టాలెక్కించలేదు. దీంతో ఈ ప్రాజెక్టును పవన్ కల్యాణ్ ఆపేసినట్లు జోరుగా ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో గత ఆదివారమే దీన్ని 'ఉస్తాద్ భగత్ సింగ్' పేరుతో చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అంతేకాదు, ఆరోజే పూజా కార్యక్రమాలను కూడా జరిపేసి అనుమానాలకు పుల్‌స్టాప్ పెట్టేశారు. ఇక, తాజాగా ఈ మూవీ నుంచి అప్‌డేట్ వచ్చింది.

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ గురించి తాజాగా తెలుగు ర్యాపర్ ప్రణవ్ చాగంటి అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చాడు. ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో అతడు 'నేను ఉస్తాద్ భగత్ సింగ్‌లో ఇంట్రో ట్రాక్ రెడీ చేశాను. ఈ అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ హరీశ్ శంకర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఈ ట్రాక్ వచ్చినప్పుడు మామూలుగా ఉండదు. ఇప్పటి వరకూ పవన్ కల్యాణ్ గారి ఇంట్రో ట్రాక్స్‌లో ది బెస్ట్ అవుతుంది. నా మాటలు రాసి పెట్టుకోండి' అని చెప్పుకొచ్చాడు. ఈ వీడియోను ఓ అభిమాని ట్విట్టర్‌లో షేర్ చేయగా.. హరీశ్ శంకర్ స్పందిస్తూ థమ్స్ అప్ ఎమోజీలు పెట్టాడు.
'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇది 'తేరీ' మూవీకి రీమేక్‌గా రాబోతున్నట్లు ఇప్పటికే న్యూస్ లీకైంది.


Click it and Unblock the Notifications











