హీరోయిన్ ప్రణీత భర్త నితిన్ రాజు ఎవరు? అతడి బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? ప్రేమ పెళ్లా? ఆ వివాహమా?
దక్షిణాదితోపాటు బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణించేందుకు ప్రయత్నిస్తున్న యువ హీరోయిన్ ప్రణిత సుభాష్ పెళ్లి వార్త సోమవారం ఉదయం దేశవ్యాప్తంగా అన్ని రకాల మీడియాలో సంచలనం రేపాయి. ఇలా గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసుకోవడమేమిటనే ప్రశ్న సినీ వర్గాల్లో వినిపించింది. ఆ తర్వాత ప్రణీత సీక్రెట్‌గా వివాహమాడిన నితిన్ రాజు ఎవరనే ప్రశ్న అందర్ని వెంటాడింది. నితిన్ రాజు వ్యక్తిగత వివరాల్లోకి వెళితే..

ఏడాదికాలంగా సమాజ సేవలో
గతేడాది కాలం నుంచి ప్రణిత సుభాష్ తన నటన గురించి కంటే కరోనావైరస్ బాధితులకు సేవలందించడం, ఈ కోవిడ్ పరిస్థితుల్లో దుర్భరంగా మారిన రోజువారీ కూలీలను ఆదుకొంటూ వార్తల్లో నిలిచారు. ఆటో రిక్షా కార్మికులకు శానిటైజర్లు అందించడం, కరోనావైరస్‌పై అవగాహన కల్పించడం చేస్తూ సోషల్ మీడియాలో అందర్నీ ఆకట్టుకొన్నారు.

హిందూ ధర్మంపై పోస్టులతో సంచలనం
ఇక హిందూ ధర్మానికి వ్యతిరేకంగా సాగుతున్న చర్చల్లో పాల్గొంటూ సోషల్ మీడియాలో సంచలన పోస్టులతో హిందూవాదులను ఆకట్టుకొన్నారు. ఇక ప్రణిత వ్యక్తిగత జీవితం, అఫైర్ల గురించి కూడా పెద్దగా మీడియాలో చర్చ జరిగిన ఆనవాళ్లు కూడా లేకపోవడంతో ఆమె పెళ్లి గురించి పెద్దగా ఎవరూ ఆలోచించలేదు. ఈ క్రమంలో హఠాత్తుగా పెళ్లి చేసుకోవడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

ప్రేమ పెళ్లా? పెద్దల కుదిర్చిన పెళ్లా?
ఇక ప్రణిత సుభాష్, నితిన్ రాజు మధ్య ఎలాంటి ప్రేమ వ్యవహారం లేదని సన్నిహితులు వెల్లడిస్తున్నారు. వీరిద్దరిది పెద్దలు కుదర్చిన వివాహంగా పేర్కొంటున్నారు. కొద్ది రోజలు క్రితమే ఇరు కుటుంబాల మధ్య పెళ్లికి సంబంధించిన చర్చలు జరగడం, ఆ తర్వాత హడావిడిగా పెళ్లి ప్లాన్స్ తెరపైకి వచ్చాయనే విషయాన్ని స్వయంగా ప్రణిత వెల్లడించారు.

నితిన్ రాజు వ్యక్తిగత వివరాలు
ఇక ప్రణిత సుభాష్ పెళ్లి చేసుకొన్న నితిన్ రాజు పేరు మీడియాలోను, సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఎవరు ఈ నితిన్ రాజు అనే ప్రశ్న అందర్ని వెంటాడింది. నితిన్ రాజు విషయానికి వస్తే బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త. హస్పిటల్ మేనేజ్‌మెంట్‌లో ఉన్నత విద్యను అభ్యసించారు. స్కూల్ డీ హాస్పిటాలిటీ కాలేజీలో చదువుకొన్నారు.

నితిన్ రాజు ప్రొఫెషనల్ వ్యవహారాలు
సంప్రదాయ హిందూ కుటుంబానికి చెందిన నితిన్ రాజు బెంగళూరులో బ్లూ హారిజన్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను 2011లో ప్రారంభించారు. ఈ సంస్థకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. గత పదేళ్లుగా ఆయన వ్యాపారం దినదినాభివృద్ధితో ముందుకెళ్తున్నది. హోటల్ రంగంలో తన ప్రతిభతో మంచి లాభాలతో తన సంస్థను నడిపిస్తున్నట్టు కన్నడ ట్రేడ్ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.


Click it and Unblock the Notifications











