Hanu Man: ఊహించని షాక్.. వెనక్కి తగ్గిన సూపర్ హీరో హను-మాన్.. కారణం ఇదే!
తెలుగు చిత్ర పరిశ్రమలో క్రియేటివ్ కాన్సెప్ట్ ఒరియెంటెడ్ చిత్రాలు తెరకెక్కించే దర్శకులలో ప్రశాంత్ వర్మ ఒకరు. అ!, కల్కి, జాంబీ రెడ్డి వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన ప్రశాంత్ వర్మ తాజాగా హనుమాన్ తో రాబోతున్నాడు. ఇండియన్ సూపర్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఒక యంగ్ డైరెక్టర్.. మరో యంగ్ హీరోతో చేస్తున్న ప్రయోగమే హనుమాన్. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్లారిటీ ఇచ్చి షాక్ ఇచ్చారు మేకర్స్.

అ! చిత్రంతో తెలుగు ప్రేక్షకులను వావ్ అనిపించిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఇప్పుడు ఆయన తాజాగా తెరకెక్కించిన చిత్రం హనుమాన్. ఈ సినిమాలో యంగ్ హీరో తెజ సజ్జా ప్రధాన పాత్ర పోషిస్తుండగా ఇప్పటికే ఈ సినిమాలోని పాత్రలను పరిచయం చేశారు. అంజమ్మగా వరలక్ష్మీ శరత్ కుమార్, మైఖేల్ గా వినయ్ రాయ్, మీనాక్షిగా అమృత అయ్యర్ పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇటీవల విడుదల చేసిన హనుమాన్ టీజర్ కు దేశవ్యాప్తంగా ప్రేక్షకులందరికీ మైండ్ బెండ్ అయింది.

హనుమాన్ సినిమాను మే 12న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీతోపాటు స్పానిష్, కొరియన్, జపనీస్, చైనీస్ భాషలతో కలిపి మొత్తంగా 11 భాషల్లో విడుదల చేస్తున్నట్లుగా ఇదివరకు ప్రకటించారు. అయితే విడుదల తేది సమయం దగ్గరపడుతున్న ప్రమోషన్స్, అప్డేట్స్ ఏం రాలేదు. ఈ క్రమంలో తాజాగా మూవీ విడుదలపై క్లారిటీ ఇచ్చింది చిత్రబృందం. హనుమాన్ సినిమా రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్లుగా తాజాగా ప్రకటించారు మేకర్స్.
"హనుమాన్ టీజర్ పట్ల మీరు చూపించిన అమితమైన ప్రేమ మా హృదయాలను హత్తుకుంది. అలానే బెస్ట్ అవుట్ పుట్ అందించే బాధ్యతను రెట్టింపు చేసింది. అందరికీ నచ్చే విధంగా ఒక మంచి చిత్రాన్ని అందిస్తామని మేము మీకు వాగ్దానం చేస్తున్నాం. లార్డ్ హనుమంతునికి పరిపూర్ణమైన గీతంగా, అందరూ సెలబ్రేట్ చేసుకునేలా ఈ సినిమా నిలుస్తుంది. హను-మాన్ చిత్రాన్ని బిగ్ స్క్రీన్ పై చూపించడానికి మేం ఎదురుచూస్తున్నాం. కొత్త విడుదల తేది త్వరలో ప్రకటిస్తాం. జై శ్రీరామ్" అని మేకర్స్ తెలిపారు.


Click it and Unblock the Notifications











