twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మీ అంచనాలకు తగ్గట్టుగానే.. ‘సలార్’పై ప్రశాంత్ నీల్ కామెంట్స్

    |

    కేజీయఫ్ సినిమాతో ప్రశాంత్ నీల్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ అయ్యారు. ఆయన మీద ఉండే నమ్మకాన్నినిలబెట్టుకునేలా కేజీయఫ్ చాప్టర్ 2ని తెరకెక్కించాడు. దానికి శాంపిల్‌గా టీజర్‌ను వదిలితే ఇప్పటికీ రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉంది. చాప్టర్ 2 టీజర్ తరువాత అంచనాలన్నీ వంద రెట్లు అయ్యాయి. అలాంటిది ప్రశాంత్ నీల్ తరువాతి సినిమాపై ఇంకెన్ని అంచనాలుంటాయి. అది కూడా ప్రభాస్ వంటి స్టార్‌తో అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

    ఒకే ఒక్క పోస్టర్‌తో ప్రభాస్‌ను 'సలార్'గా పరిచయం చేశాడు ప్రశాంత్ నీల్. అప్పట్లో ఈ పదంపైనే చర్చలు జరిగాయి. సలార్ అంటే రాజుకు కుడిభుజం, సైన్యాధిపతి (కమాండర్‌ ఇన్‌ చీఫ్‌) వంటి అర్థాలు వస్తాయని ప్రశాంత్ వివరించాడు. అయితే ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా లాంచ్ చేశారు. తాజాగా ఈ మూవీ పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ ఈవెంట్‌కు ప్రభాస్‌తో పాటు యశ్ కూడా హాజరయ్యాడు.

    Prashanth Neel About Salaar Launch

    సలార్ సినిమా లాంచింగ్‌పై అభిమానులు చూపించిన ప్రేమకు ప్రశాంత్ నీల్ ఎమోషనల్ అయ్యాడు. ఈ మేరకు సలార్ గురించి చెబుతూ.. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నిర్మాతకు, ప్రభాస్‌కు థ్యాంక్స్. నా రాకీ యశ్ ఇక్కడకు వచ్చినందుకు థ్యాంక్స్. మీ అందరి అంచనాలకు తగ్గట్టుగా, దాన్ని మించేలానే సలార్ ఉంటుంది. మీరు చూపించిన ప్రేమకు ఇస్తోన్న సపోర్ట్‌కు థ్యాంక్స్ అంటూ ప్రశాంత్ నీల్ ట్వీట్ చేశాడు.

    English summary
    Prashanth Neel About Salaar Launch, Thank you VKiragandur sir and #Prabhas sir for this opportunity. Thank you my rocky TheNameIsYash for being with us today. Will not let you all down!! Overwhelmed with all the love and support coming our way.Thank you everyone
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X