షారుక్ ఖాన్‌కు ప్రశాంత్ నీల్ క్షమాపణలు.. నిర్మాతతో వివాదానికి ముగింపు అలా!
ప్రభాస్ నటించిన సలార్, అలాగే షారుక్ ఖాన్ నటించిన డంకీ సినిమా మధ్య నెలకొన్న వివాదానికి ప్రశాంత్ నీల్ ముగింపు పలికారు. గతేడాది డిసెంబర్‌లో ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి. అయితే నార్త్‌లో పీవీఆర్ సలార్ సినిమాకు స్క్రీన్లు కేటాయించలేదనే వివాదం కూడా తెరపైకి వచ్చింది. ఈ బాక్సాఫీస్ పోరులో డంకీ చిత్రం సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకోగా, సలార్ విజయం సాధించింది. ఈ సంఘటనపై ప్రశాంత్ నీల్ స్పందించారు. ఆయన ఓ ఇంటర్య్వ్యూలో మాట్లాడుతూ..
బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాత, దర్శకుడు రాజ్ కుమార్ హిరాణి రూపొందిన డంకీ చిత్రం భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన రోజు రిలీజ్ డేట్ ప్రకటించారు. దాదాపు సంవత్సరం ముందే ఈ మూవీ రిలీజ్ డేట్‌ను 2023 డిసెండర్ 21 తేదీ ప్రకటించారు.

అయితే అనూహ్యంగా డంకీకి పోటీగా ఉత్తరాదిన సలార్ చిత్రాన్ని రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఈ సినిమాను సౌత్‌తోపాటు నార్త్ ఇండియాలో కూడా రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమా 22 తేదీ డిసెంబర్‌లో రిలీజ్ అవుతుంది అని అనౌన్స్ చేశారు. దాంతో బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ వర్సెస్ షారుక్ ఖాన్ అనే ట్రెండ్ మొదలైంది.
ఇదిలా ఉండగా, ఈ రెండు సినిమా ఒకేసారి రిలీజ్ కావడంతో భారీ వివాదం చోటు చేసుకొన్నది. ఉత్తరాదిలోను అలాగే పీవీఆర్ మల్టీప్లెక్ష్‌లోను సలార్ సినిమాకు షోలు కేటాయించకపోవడం భారీ చర్చకు దారి తీసింది. అలాగే డంకీకి డిజాస్టర్ టాక్ నేపథ్యంలో అసలు ప్రేక్షకులే రాకున్నా బలవంతంగా ఆ సినిమాను ఆడించారనేది వివాదంగా మారింది.
సలార్‌తో డంకీ వివాదం నేపథ్యంలో తాజాగా ప్రశాంత్ నీల్ తన స్పందనను తెలియజేశారు. సలార్ రిలీజ్ విషయంలో మాకు ఆ ఒక్క డేట్ అనుకూలంగా ఉంది. తప్పనసరి పరిస్థితుల్లో మేము మూవీ రిలీజ్ చేశాం. వాళ్లు సంవత్సరం ముందే డేట్ ప్రకటించారు. అలాంటి పరిస్థితుల్లో మేము సలార్‌ను రిలీజ్ చేయడం తప్పు అందుకు నేను క్షమాపణ చెబుతున్నాను అని ప్రశాంత్ నీల్ అన్నారు.
డంకీ సినిమాకు పోటీగా సలార్ మూవీని వేయాలనే ఉద్దేశం నాకు లేదు. డంకీ మూవీ షారుక్, రాజ్ కుమార్ హిరాణికి పెద్ద సినిమా. మాకు కొన్ని జాతకలు, గ్రహాలను నమ్ముతాం. మా సెంటిమెంట్లను గౌరవించి సలార్ సినిమాను రిలీజ్ చేయాల్సి వచ్చింది. మా సినిమా యూనిట్ నుంచి మరోసారి క్షమాపణలు చెబుతున్నాం అని ప్రశాంత్ నీల్ తెలిపారు.


Click it and Unblock the Notifications











