Dragon: డ్రాగన్ మూవీపై ప్రశాంత్ నీల్ బిగ్ ట్విస్ట్.. జూ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు షాక్
ఇపుడు ఇండియన్ సినిమా దగ్గర రాబోతున్న పలు భారీ చిత్రాలు అలాగే పలు సెన్సేషనల్ కాంబినేషన్ లు కూడా ఉన్నాయి. కాగా ఇలాంటి భారీ కలయికా చిత్రాల్లో దర్శకుడు ప్రశాంత్ నీల్ మరియు టాలెంటెడ్ హీరో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ల కలయికలో చేస్తున్న సినిమా కూడా ఒకటి. కాగా ఈ చిత్రం ఎపుడో అనౌన్స్ అయ్యింది కానీ ఇపుడు ఫైనల్ గా పట్టాలెక్కుతోంది.
కాగా ఈ సినిమా విషయంలో మాత్రం మొదటి నుంచీ కొన్ని ఆసక్తికర పరిస్థితులే ఉన్నాయని చెప్పవచ్చు. కాగా ఈ చిత్రం ఎన్టీఆర్ అభిమానులు తమ హీరోతో ప్రశాంత్ నీల్ కి డ్రీం సినిమా ఇది అని ఇప్పటికీ చెబుతూ ఉంటారు కానీ అసలు వాస్తవం మరొకటి ఉందని కొన్ని ప్రూఫ్స్ కనిపిస్తున్నాయి. కాగా నిజానికి ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేయాలి అనుకున్నాడు అనేది మొదటి నుంచీ ఉన్న మాట.

కాగా ముందుగా ఎవరో ఒకరి సైడ్ నుంచి ముందు కదలిక లేకపోతే ఎలాంటి భారీ సినిమా కూడా ఉండదు. అలానే కేజీఎఫ్ సినిమాలు చూసిన తర్వాత మైత్రి మూవీ మేకర్స్ తో మాట్లాడి నీల్ దగ్గర ఏదన్నా కథ ఉందేమో కనుక్కోమని అలా ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ సినిమాని సెట్ చేసుకున్నారు. కాగా ఇది ఎవరో చెప్పిన మాట కూడా కాదు స్వయంగా మైత్రి నిర్మాత చెప్పిన మాటే..
కాగా మళ్ళీ కొన్నాళ్ళకి ప్రశాంత్ నీల్ కి అభిమాన హీరో ఎన్టీఆర్ మాత్రమే అని తన కోసమే డ్రాగన్ సినిమా రెడీ చేసాడు అంటూ తారక్ అభిమానులు మళ్ళీ రచ్చ స్టార్ట్ చేశారు. కాగా ఈ నేపథ్యంలో ప్రశాంత్ నీల్ నుంచి వచ్చిన ఓ స్టేట్మెంట్ ఇపుడు అందరి గాలి తీసేటట్టు మారింది. నిజానికి తాను ఎవరినీ అప్రోచ్ కాలేదు అని తననే ఆ సినిమా కోసం మేకర్స్ అప్రోచ్ అయ్యారు అంటూ అసలు విషయాన్ని రివీల్ చేసాడు.
దీనితో మైత్రి నిర్మాతల కామెంట్స్ కి దీనికి పొంతన సరిపోయింది కాబట్టి ఇన్ని రోజులు ఏదో అనుకుంటున్న ఎన్టీఆర్ అభిమానులకి ఇది మాత్రం ఊహించని ట్విస్ట్ గా మారింది అని చెప్పక తప్పదు. అలాగే ఇంకో పక్క ఇది ప్రభాస్ తో సలార్ సినిమాల కోసమే అన్నారు అంటూ ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు కానీ అక్కడ మైత్రి నిర్మాత చెప్పిన మాటలు ప్రకారం మాత్రం నీల్ స్టేట్మెంట్ ఎన్టీఆర్ తో సినిమా కోసమే అన్నట్టు అనిపిస్తుంది.
సో ఇలా తన తాజా స్టేట్మెంట్ మాత్రం ఇపుడు రచ్చ లేపుతుంది. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాలో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్ తదుపరి ప్రభాస్ తో అవైటెడ్ సీక్వెల్ చిత్రం సలార్ పార్ట్ 2 శౌర్యంగ పర్వం చేయనున్నాడు. దీనితో ఈ చిత్రం కోసం అభిమానులు మంచి ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్నారు. కాగా ఈ ఏడాదిలోనే ఎన్టీఆర్ తో సినిమా పూర్తి కానుండగా అది వచ్చే ఏడాది సంక్రాంతికి కానుకగా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











