Salaar: సలార్ మూవీపై కేజీఎఫ్ ఎఫెక్ట్.. మొత్తం మార్చేసిన ప్రశాంత్ నీల్

కృష్ణంరాజు ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో స్టార్‌గా ఎదిగిపోయాడు రెబెల్ స్టార్ ప్రభాస్. ఆరంభంలోనే ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న అతడు.. మార్కెట్‌ను, ఫాలోయింగ్‌ను భారీగా పెంచుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అప్పటి నుంచి పంథాను మార్చుకోవడంతో పాటు రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. అందులో అన్ని మూవీలు పాన్ ఇండియా రేంజ్‌లోనే రూపొందుతున్నాయి. ఇలా ఇప్పటికే ప్రభాస్ పలు చిత్రాలను ప్రేక్షకులకు అందించిన విషయం తెలిసిందే.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవలే 'రాధే శ్యామ్' అనే చిత్రంలో నటించాడు. రాధాకృష్ణ కుమార్‌ రూపొందించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా చేసింది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రం ప్రభాస్‌కు నిరాశనే మిగిల్చింది. ఆరంభంలోనే నెగెటివ్ టాక్‌ను అందుకున్న ఈ సినిమాకు ఆదరణ అస్సలు దక్కలేదు. ఫలితంగా ఈ సినిమా ఫుల్ రన్‌లో కేవలం రూ. 83 కోట్లు వరకే వసూలు చేసి.. ఏకంగా రూ. 120 కోట్ల నష్టాలను ఎదుర్కొంది. ఫలితంగా బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా మిగిలిపోయింది. దీని తర్వాత ప్రభాస్ తన ఫ్యూచర్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇందులో భాగంగానే కొన్ని చిత్రాల షూట్‌లలో పాల్గొంటున్నాడు.

రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తోన్న సినిమాల్లో 'సలార్' ఒకటి. 'కేజీఎఫ్' వంటి భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను రూపొందించిన ప్రశాంత్ నీల్ ఈ మూవీని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్నాడు. చాలా రోజుల క్రితమే మొదలైన ఈ మూవీ షూటింగ్.. మొదటి షెడ్యూల్‌ను సింగరేణి బొగ్గు గనుల్లో కంప్లీట్ చేసుకుంది. అందులో హీరో ఇంట్రడక్షన్ సీన్స్‌తో పాటు ఓ భారీ ఫైట్‌ సీక్వెన్స్‌ను కూడా షూట్ చేశారు. ఇక, కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ముగిసిన రెండో షెడ్యూల్‌లో రెబెల్ స్టార్ ప్రభాస్‌తో కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్‌ను కంప్లీట్ చేసుకున్నారు. ఆ తర్వాత పలు ప్రాంతాల్లో కొన్ని షెడ్యూళ్లను ప్లాన్ చేస్తున్నారు.

Prashanth Neel Changes Prabhas Elevation Scenes in Salaar

క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'సలార్' మూవీ గురించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. దీని ప్రకారం.. కేజీఎఫ్ చాప్టర్ 2 విడుదలైన తర్వాత వచ్చిన రెస్పాన్స్ నేపథ్యంలో ప్రభాస్ సినిమాలో కొన్ని మార్పులు చేస్తున్నాడట దర్శకుడు ప్రశాంత్ నీల్. మరీ ముఖ్యంగా ఇందులో హీరో ఎలివేషన్ సీన్స్‌ను రీ డిజైన్ చేస్తున్నాడట. మొత్తానికి కేజీఎఫ్‌లో రాఖీ భాయ్‌ను చూపించిన దానికంటే హైప్‌తో ఇందులో ప్రభాస్‌ను చూపించాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నాడట. అలాగే, కొన్ని యాక్షన్ సీక్వెన్స్ నిడివిని కూడా కాసింత తగ్గించాలని అనుకుంటున్నాడట. ఇలా ప్రశాంత్ నీల్ చాలా మార్పులు చేయబోతున్నాడని తెలిసింది.

భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న 'సలార్' మూవీలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. హాట్ బ్యూటీ శృతి హాసన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. జగపతి బాబు ఇందులో విలన్‌గా నటిస్తున్నాడు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X