NTR31: ఎన్టీఆర్ మూవీపై ప్రశాంత్ నీల్ క్లారిటీ.. అప్పటి నుంచే రచ్చ షురూ

తెలుగు సినీ ఇండస్ట్రీలో దాదాపు రెండు దశాబ్దాలకు పైగానే హవాను చూపిస్తూ.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌తో దూసుకుపోతోన్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. కెరీర్ ఆరంభంలో నందమూరి ఫ్యామిలీ అభిమానుల ఆదరణతో ఎదిగిన అతడు.. ఆ తర్వాత తనకంటూ ఫ్యాన్‌బేస్‌ను ఏర్పరచుకున్నాడు. వాళ్లను అలరించేందుకు ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇక, ఇటీవలి కాలంలో ఎన్టీఆర్ వరుసగా 'టెంపర్', 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్', 'జై లవ కుశ', 'అరవింద సమేత.. వీరరాఘవ' వంటి భారీ హిట్లతో సత్తా చాటుతున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో ప్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నాడు.

కెరీర్‌లోనే భీకరమైన ఫామ్‌తో కనిపిస్తోన్న టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్.. ఇటీవలే RRR (రౌద్రం రణం రుధిరం) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ సినిమా ఘన విజయాన్ని అందుకుంది. అంతేకాదు, ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేసింది. అలాగే, ఎన్టీఆర్ క్రేజ్‌ను నేషనల్ రేంజ్‌కు పెంచేసింది. ఈ ఉత్సాహంతోనే యంగ్ టైగర్ తన తదుపరి చిత్రాన్ని బడా డైరెక్టర్ కొరటాల శివతో చేయబోతున్నాడు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ వీడియోను వదిలారు. ఇక, ఈ సినిమా వచ్చే అక్టోబర్ నుంచి ప్రారంభం కాబోతుందని తెలుస్తోంది.

Prashanth Neel Clarity on Jr NTR Movie Start

నందమూరి చిన్నోడు ఎన్టీఆర్ చాలా రోజుల క్రితమే తన 31వ సినిమాను కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో చేయబోతున్నట్లు వెల్లడించాడు. దీన్ని కొరటాల శివ మూవీ తర్వాత మొదలు పెడుతున్నట్లు కూడా వెల్లడించాడు. ఈ గ్యాప్‌లో ప్రశాంత్ కూడా ప్రభాస్‌తో చేస్తున్న 'సలార్'ను పూర్తి చేస్తాడని క్లారిటీ ఇచ్చాడు. అయితే, ఈ సినిమా అనుకున్న సమయానికంటే ముందే మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయని ఇటీవలే ఓ న్యూస్ వైరల్ అయింది. అంతేకాదు, ఖాళీ సమయంలో ప్రశాంత్ నీల్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో చేయబోయే సినిమాకు సంబంధించిన కాస్టింగ్, ప్రీ ప్రొడక్షన్ మీద ఫోకస్ చేస్తున్నారని కూడా ప్రచారం జరుగుతోంది.

ఎన్టీఆర్‌ 31వ సినిమా ప్రారంభం గురించి కొద్ది రోజులుగా ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ మీడియా ముందరే దీనిపై క్లారిటీ ఇచ్చాడు. తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయనను ఎన్టీఆర్ 31వ సినిమా ఎప్పుడు మొదలు పెట్టబోతున్నారు అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనికి ప్రశాంత్ 'ఎన్టీఆర్ సినిమాను 2023 ఏప్రిల్ లేదా మే నుంచి మొదలు పెట్టబోతున్నాం' అంటూ వెల్లడించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఏకంగా దర్శకుడే ఈ సినిమా గురించి ప్రకటించడంతో ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతోన్నారు.

క్రేజీ కాంబోలో రాబోయే ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, నందమూరి తారక రామారావు ఆర్ట్స్ సంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నాయి. ఇందులో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ నటించే అవకాశాలున్నాయి. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీత దర్శకుడిగా చేయబోతున్నాడు. ఇక, ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంతో రాబోతుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అలాగే, ఈ చిత్రానికి 'మిస్సైల్', 'న్యూక్లియర్', 'అసుర' అనే టైటిళ్లు పరిశీలనలో ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X