Salaar ఉగ్రం రీమేక్‌గా సలార్ ఎందుకు చేశానంటే? ప్రభాస్ మూవీపై ప్రశాంత్ నీల్ క్లారిటి!
కేజీఎఫ్ సిరీస్ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో ప్రశాంత్ నీల్ రూపొందించిన సలార్ చిత్రం కొద్దిగంటల్లో రిలీజ్‌కు సిద్దమైంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనడంతో భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది. అయితే ఈ సినిమా ప్రశాంత్ నీల్ తొలి చిత్రం ఉగ్రం సినిమాకు రీమేక్ అనే విషయం మీడియాలో కొద్ది నెలలుగా వైరల్ అయింది. అయితే రీమేక్ వ్యవహారంపై తాజాగా ప్రశాంత్ నీల్ స్పందించాడు. సలార్ సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్‌లో మాట్లాడుతూ..
కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ కొద్ది నెలల క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉగ్రం సినిమాను రీమేక్ చేస్తూ ప్రభాస్‌తో సలార్ మూవీ నిర్మిస్తున్నాడు. ఆ సినిమా కోసం తాను పనిచేశాను. రీరికార్డింగ్ భారీగా ఉంటుంది. సినిమా అందర్నీ మెప్పిస్తుంది అని చెప్పాడు. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఆ విషయాన్ని తేలికగా కొట్టిపడేశారు.

అయితే తాజాగా దర్శకుడు ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.. ఉగ్రం సినిమా తీసినప్పుడు ఆ మూవీ థియేటర్లు ప్రేక్షకులతో కిక్కిరిసిపోతాయని అనుకొన్నాను. కానీ నా అంచనా ఎక్కడో తప్పింది. అది నాకు నిరాశకు గురిచేసింది. 2014 లో ఆ కోరిక అసంతృప్తికి గురిచేసింది. ఉగ్రం సినిమాకు న్యాయం చేయలేదనే ఫీలింగ్ నన్ను వెంటాడింది అని అన్నారు.
ఉగ్రం సినిమా సరిగా ప్రేక్షకులకు చేరలేదని నేను ఎప్పుడూ భావిస్తుంటాను. కేజీఎఫ్‌తో ఆ అసంతృప్తి కొంత తీరింది. కానీ ఉగ్రం మూవీకి నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది. అందుకోసమే ప్రభాస్‌తో సలార్ తీయాలని సంకల్పించాను. కానీ సలార్‌ను ఓ రీమేక్‌గా భావించడం లేదు అని ప్రశాంత్ నీల్ చెప్పారు.

ఉగ్రం కథతో సలార్ చేయాలని భావించినప్పుడు.. ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్‌కు సూట్ అయ్యేలా కథలో మార్పు చేశాను. ఉగ్రం కథను, కేజీఎఫ్ స్టైల్ ఆఫ్ మేకింగ్ మిక్స్ చేయడం వల్ల కొందరు క్రిటిక్స్ విమర్శించే అవకాశం ఉంది. అయితే వారి విమర్శలను కాంప్లిమెంట్‌గా తీసుకొంటాను. ఆ రెండు సినిమాలు నా క్రియేషన్‌కు ప్రతిరూపం. వాటి కోసం ఓ ప్రపంచాన్ని నిర్మించాం అని ప్రశాంత్ నీల్ చెప్పారు.


Click it and Unblock the Notifications











