‘ఎన్టీఆర్ నిర్వాకంతో భయపడ్డా.. యంగ్ టైగర్ చేసిన పనికి ఆయన భార్య అలాంటి షాక్‌లో*
ఇండియన్ సినిమా రంగంలో మోస్ట్ అవైటెడ్ మూవీ డ్రాగన్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్, మలయాళ నటుడు బిజూ మీనన్‌తోపాటు రుక్మిణి వసంత్, కుష్బూ సుందర్, రాజీవ్ కనకాల, అశుతోష్ రాణా, ప్రభాస్ శ్రీను, శత్రు, బెనెడిక్ట్ పాల్ గ్యారెట్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్, కొసరాజు హరికృష్ణ, నందమూరి కల్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు.
ఈ సినిమా సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే..మ్యూజిక్: రవి బస్రూర్, సినిమాటోగ్రఫి: భువన్ గౌడ, ఎడిటర్: ప్రణవ్ శ్రీ ప్రసాద్, స్టంట్స్: పీటర్ హెయిన్స్ తదితరులు వ్యవహరిస్తున్నారు. నందమూరి తారక రామారావు (జూనియర్ ఎన్టీఆర్) 43వ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు.
అయితే ఈ సినిమా గ్లింప్స్‌పై కొంత మేర పాజిటివ్, మరికొంత మేర నెగిటివ్ టాక్ కనిపించింది. మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకొన్న గ్లింప్స్ నేపథ్యంలో ఎన్టీఆర్ లుక్ గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భరద్వాజ్ రంగనాథన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఆయన ఈ సినిమా గురించి మాట్లాడుతూ..

డ్రాగన్ సినిమా కథ రాయడానికి మూడేళ్ల సమయం తీసుకొన్నాను. స్క్రిప్ట్ పూర్తయిన తర్వాత చూసుకొని.. ఇక మొదలుపెట్టాల్సిందేనని డిసైడ్ అయ్యాను. ఈ సినిమా కథ ముగింపులో ఎన్టీఆర్ క్యారెక్టర్ గురించి ఆలోచించాను. ఈ క్యారెక్టర్ లక్ష్యం ఏమిటనే విషయాన్ని పూర్తిగా అర్ధం చేసుకొన్నాను. ఇలాంటి క్యారెక్టర్ చాలా రిస్క్‌తో కూడుకొన్నది. ఎన్టీఆర్ స్టార్డడమ్ దృష్టిలో పెట్టుకొంటే చాలా డిఫరెంట్.. రిస్క్ ఎక్కువగా ఉంటుంది అని ప్రశాంత్ నీల్ చెప్పారు.
అయితే డ్రాగన్ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను గతేడాది రిలీజ్ చేయాలని అనుకొన్నాను. కానీ ఆ సమయంలో దేవర సినిమా రిలీజ్‌కు ఉంది. దాంతో డ్రాగన్ గ్లింప్స్ వద్దని ఎన్టీఆర్ చెప్పాడు. దాంతో నేను ఆ ప్రయత్నం మానుకొన్నాను అని డ్రాగన్ గ్లింప్స్ జాప్యం గురించి వివరణ ఇచ్చారు.
అయితే డ్రాగన్ సినిమా కోసం లూగస్ పాత్ర కోసం బరువు తగ్గమని చెప్పాను. కానీ ఎన్టీఆర్ నిర్వాకం చూసి మతిపోవడమే కాకుండా షాక్‌కు గురి అయ్యాను. ఆయన 4 నెలల్లో 15 కేజీల బరువు తగ్గాడు. ఆయన ఆకారాన్ని చూసి దిగ్బ్రాంతికి లోనై.. ఇక బరువు తగ్గడం వెంటనే ఆపమని చెప్పాను. ఆ సమయంలో ఆయనను చూస్తే.. అత్యంత బలహీనంగా, పేలవంగా, జబ్బు పడిన మనిషిలా కనిపించాడు. నేను వారించినా ఆయన బరువు తగ్గడం ఆపలేదు అని ప్రశాంత్ నీల్ తెలిపారు.
అయితే ఎన్టీఆర్ నిర్వాకం చూసి నేను అప్‌సెట్ అయ్యాను. నేను మాత్రమే కాదు. ఆయన భార్య కూడా అప్‌సెట్ అయ్యారు. నా టీమ్ కూడా కంగారు పడింది. అయినా ఆయన మొండిగా బరువు తగ్గే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. నా విజన్‌లో ఉన్న క్యారెక్టర్ కోసం ఏమైనా చేయడానికి సిద్దంగా ఉన్నానని చెప్పాడు. ఆయన మొండిపట్టును చూసి ఓ రకమైన భయం పట్టుకొన్నది అని ప్రశాంత్ నీల్ చెప్పారు. ఈ సినిమా 2027 జూన్ 11వ తేదీన రిలీజ్ కానున్నది. ఈ సినిమా ఇండియన్ సినిమాలోనే అత్యంత దేశభక్తి చిత్రంగా రూపుదిద్దుకోబోతున్నదని ఆయన స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications