‘సలార్’ నుంచి షాకింగ్ అప్‌డేట్: ఆ ఎపిసోడ్‌ను ట్రిమ్ చేస్తున్న ప్రశాంత్ నీల్
పాన్ ఇండియా హీరోగా పేరొందిన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఏక కాలంగా ఒకదాని తర్వాత ఒకటి ఇలా పలు చిత్రాల షూటింగ్‌లలో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం ఈ స్టార్ హీరో నటిస్తోన్న చిత్రాల్లో 'సలార్' ఒకటి. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. అయితే, అనివార్య కారణాల వల్ల రెండో షెడ్యూల్ మాత్రం ఇంకా మొదలవలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ ప్రతిష్టాత్మక చిత్రం గురించి ఓ షాకింగ్ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
'కేజీఎఫ్' వంటి భారీ యాక్షన్ మూవీ తర్వాత స్టైలిష్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న చిత్రమే 'సలార్'. ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీ ఇండో - పాక్ వార్ నేపథ్యంతో రాబోతుందని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఇందులో సెకెండాఫ్‌లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ హైలైట్‌గా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అయితే, తాజా సమచారం ప్రకారం.. ఈ సినిమా ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌ను ప్రశాంత్ నీల్ ట్రిమ్ చేస్తున్నాడట. అనుకున్న స్క్రిప్ట్ మొత్తంలో తగ్గించడానికి ఎక్కడా అవకాశం లేకపోవడం వల్లే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌ను తగ్గించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'సలార్' మూవీలో ప్రభాస్ డుయల్ రోల్ చేస్తున్నాడట. సెకెండాఫ్‌లో వార్ ఎపిసోడ్‌ను హైలైట్ చేయబోతున్నారని అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ పూర్తవగా.. రెండోది త్వరలోనే ప్రారంభం కాబోతుంది. ఇక, ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. దీన్ని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. ఇందులో జ్యోతిక, రమ్యకృష్ణ కీలక పాత్రలను చేస్తున్నట్లు ఆ మధ్య ఓ న్యూస్ బయటకు వచ్చింది. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











