Salaar : సలార్ 2 మూవీలో దేవా తమ్ముడిగా అఖిల్ అక్కినేని... క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ నీల్ భార్య!
గత కొద్ది రోజులుగా సలార్ పార్ట్ 2 చిత్రం గురించి ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఇటీవల సలార్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో అక్కినేని హీరో అఖిల్ కనబడటంతో.. అందరూ సలార్ పార్ట్ 2 చిత్రంలో అఖిల్ ఉండబోతున్నట్లు ప్రచారం సాగింది. ఇక దేవా తమ్ముడిగా అఖిల్ నటిస్తాడు అంటూ నెట్టింట వీడియోలు, వార్తలు వచ్చాయి. ఇక తాజాగా ఈ విషయంపై ప్రశాంత్ నీల్ భార్య క్లారిటీ ఇచ్చింది. అసలు విషయం చెప్పి షాకిచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే...
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గత ఏడాది రెండు చిత్రాలు రిలీజ్ చేశాడు. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆదిపురుష్ రిలీజ్ చేయగా.. ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. ఇక ఆ తర్వాత కేజీఎఫ్ సిరీస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్. ఇక ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించాగ.. పృథ్విరాజ్ సుకమారన్, జగపతి బాబు, శ్రేయా రెడ్డి తదితరులు కీలక పాత్రలో నటించారు.

ఇక ఈ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నాడు ప్రభాస్. ఇక దీనికి పార్ట్ 2 ఉంటుందని దర్శకుడు క్లైమాక్స్ లో చూపించాడు. సలార్ శౌర్యంగ పర్వం అంటూ పేరును కూడా రివిల్ చేశాడు. మొదటి పార్ట్ లో ప్రశ్నలుగా మిగిలిన వాటికి రెండో పార్టులో క్లారిటీ రానుందని తెలుస్తోంది. ఇక తాజాగా ఈ చిత్రం ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. నెట్ ఫ్లిక్స్ వేదికగా ఈ చిత్రం జనవరి 20 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇదిలా ఉంటే.. ఇటీవల సలార్ సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకుంది.
ఇక సక్సెస్ సెలబ్రేషన్స్ లోయంగ్ హీరో అఖిల్ అక్కినేని కనిపించి ప్రేక్షకులకు షాకిచ్చాడు. దీనితో అందరూ సలార్ పార్ట్ 2లో అఖిల్ కనిపించబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. పార్ట్ 2 లో గాని అఖిల్ ఉన్నాడా అనే ప్రశ్న చాలా మందిలో ఎగ్జైటింగ్ గా మారింది. పార్ట్ 2లో దేవా తమ్ముడుగా అఖిల్ ఉంటాడు అంటూ కథనాలు వచ్చాయి. ఇక ప్రభాస్, అఖిల్ కలిసి హిట్ కొట్టబోతున్నట్లు వార్తలు వచ్చాయి.

అందుకే అఖిల్ వారితో సక్సెస్ సెలబ్రేషన్స్ లో కనిపించారని టాక్ వినిపించింది. ఇదిలా ఉంటే.. ఈ విషయంపై క్లారిటీ వచ్చేసింది. ప్రశాంత్ నీల్ భార్య లిఖిత రెడ్డి ఇన్ స్టా గ్రామ్ లో ఫాలోవర్స్ తో ఇంటరాక్ట్ అయింది. అందులో అఖిల్ ఎందుకు వచ్చారు అంటూ ఓ అభిమాని అడిగిన ప్రశ్నపై ఆమె క్లారిటీ ఇచ్చారు. సలార్ 2 లో అఖిల్ ఉన్నాడు అనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని అవన్నీ ఒట్టి రూమర్స్ మాత్రమే అని కన్ఫర్మ్ చేసింది.

ఇక ఈ విషయం తెలియడంతో.. అక్కినేని ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. ఇక సలార్ శౌర్యంగ పర్వంలో అఖిల్ లేనట్టే అని ఫిక్స్ అయ్యారు. అసలు అఖిల్ రావడానికి కారణం... హోంబలే ఫిలిమ్స్ బ్యానర్లో అఖిల్ ఓ సినిమా చేస్తున్నాడని.. అందుకే ఆ బ్యానర్ లో తెరకెక్కిన సలార్ సెలబ్రేషన్స్ కు వచ్చినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











