Salaar: ప్రభాస్ ఫ్యాన్స్‌కు డైరెక్టర్ వైఫ్ గుడ్ న్యూస్.. ఆ ఫొటో షేర్ చేయడంతో!
టాలీవుడ్‌లో ప్రస్తుతం చాలా సినిమాలు పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతోన్నాయి. అందులో కొన్ని మాత్రమే ప్రపంచం దృష్టిని ఆకర్షించి మరింత హైలైట్ అవుతున్నాయి. అలాంటి వాటిలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'సలార్' ఒకటి. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో తెలిసిందే.
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'సలార్' మూవీకి సంబంధించిన టాకీ పార్టును చిత్ర యూనిట్ ఇటీవలే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. రెండు భాగాలుగా రాబోతున్న ఈ మూవీలోని ఫస్ట్ పార్ట్ 'సలార్: సీజ్‌ఫైర్' పేరుతో విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఇటీవలే ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న 'సలార్: సీజ్‌ఫైర్' మూవీని సెప్టెంబర్ 28న రిలీజ్ చేయాలని భావించారు. కానీ, అనివార్య కారణాలతో ఈ సినిమా డిసెంబర్ 22కు పోస్ట్‌పోన్ అయింది. దీంతో ముందే రిలీజ్ చేయాలనుకున్న ట్రైలర్ ఆగిపోయింది. ఈ నేపథ్యంలో దీన్ని డిసెంబర్ 1వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
ఫుల్ లెంగ్త్ యాక్షన్‌తో రూపొందుతోన్న 'సలార్: సీజ్‌ఫైర్' మూవీ ట్రైలర్‌ను డిసెంబర్ 1వ తేదీన సాయంత్రం 7:19 గంటలకు విడుదల చేస్తున్నట్లు మూవీ టీమ్ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను సైతం తాజాగా వదిలింది. ఇందులో ప్రభాస్ చేతిలో గన్ పట్టుకుని యుద్ధ వీరుడిలా కనిపిస్తున్నాడు. దీంతో ఈ ట్రైలర్‌పై అందరిలోనూ అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.

'సలార్' ట్రైలర్ కోసం సినీ ప్రియులంతా ఆసక్తి ఎదురు చూస్తోన్న వేళ.. ప్రశాంత్ నీల్ భార్య లిఖితా రెడ్డి తన సోషల్ మీడియా ఖాతాలో దీనిపై పోస్ట్ చేశారు. ఈ మేరకు మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ స్టూడియో ఫొటోను షేర్ చేసిన ఆమె.. 'సలార్ ట్రైలర్ కట్ ప్రాసెస్ జరుగుతోంది' అని చెప్పారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.
ఇదిలా ఉండగా.. 'సలార్' మూవీ హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. శృతి హాసన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుండగా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా చేస్తున్నారు. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం ఇస్తున్నాడు. ఈ సినిమా అత్యధిక బిజినెస్‌ను జరుపుకుని ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది.


Click it and Unblock the Notifications











