ఎన్టీఆర్31లో 2500 మంది ఆర్టిస్ట్ లు.. ప్రశాంత్ నీల్ బిగ్ ప్లాన్!
'కేజీఎఫ్' సిరీస్ తో ఇండియాను షేక్ చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ గురించి తెలుగు ఆడియెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేమీ లేదు. ఇండియాలోనే టాప్ డైరెక్టర్లలో ఒకరిగా ఆయనకూ పేరుంది. కేజీఎఫ్ సిరీస్ తో పాటు రెబల్ స్టార్ ప్రభాస్ తో ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ మూవీ 'సలార్' ను దింపి మరోసారి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
బాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ 'డంకీ' సినిమానే బాక్సాఫీస్ వద్ద డీలా పడేలా చేశాడు. వీటన్నింటికి కారణం ప్రశాంత్ నీల్ టేకింగ్ అండ్ మేకింగ్ అనే చెప్పాలి. ఆయన ఈతరం దర్శకుల్లో సృజనాత్మకంగా, ఆడియెన్స్ కు హైనిచ్చే సినిమాలను తీసుకొస్తున్నారు. ఇక ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ప్రాజెక్ట్స్ ల్లో గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ సినిమా ఒకటి ఉన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్' ప్రాజెక్ట్ తర్వాత నుంచి ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ఎప్పుడు షురూ అవుతుందా? అని ఫ్యాన్స్ తోపాటు నార్మల్ ఆడియెన్స్ కూడా తెగ ఎదురుచూస్తున్నారు.

ఈ సందర్భంగా ఎట్టకేళలకు ఎన్నో నెలలుగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ఎన్టీఆర్31 (డ్రాగన్) ప్రాజెక్ట్ షూటింగ్ కు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి నీల్ షూటింగ్ కు సిద్ధంగా ఉన్నారు. అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దీనిపై ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాకపోయినా.. ప్రస్తుతం మాత్రం ఇన్ సైడ్ టాక్ గట్టిగానే వినిపిస్తోంది. దీనికి రీజన్ కూడా ఉండటం గమనార్హం. ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ ప్రాజెక్ట్ షూటింగ్ కోసం మేకర్స్ అన్నీ సిద్ధం చేశారంట. రామోజీ ఫిల్మ్ సిటీలో రేపటి నుంచి రెగ్యూలర్ షూటింగ్ జరగబోతోంది.
ఇక షూటింగ్ సందర్భంగా ఓ భారీ సెట్ ను కూడా నిర్మించారంట. పీరియాడిక్, ఎపిక్ యాక్షన్ సాగాగా రూపుదిద్దుకోబోతున్న ఈ చిత్రం కోసం ఆర్టిస్ట్ లను భారీగానే జమా చేస్తున్నారు నీల్. రేపటి నుంచి షూటింగ్ రెగ్యులర్ గా జరుగుతుండటంతో ఏకంగా 3000 మందిని ప్రశాంత్ నీల్ షూట్ కోసం సిద్ధం చేశారని తెలుస్తోంది. ఇందులో 2000 మంది జూనియర్ ఆర్టిస్టులు ఉండగా.. మరో 500 మందిని కాప్స్ కోసం ఎంపిక చేశారని తెలుస్తోంది. రేపు ఉదయం నుంచి షూట్ ప్రారంభించేందుకు రెడీగా ఉన్నారు.

రేపు ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్ కోసం మొత్తంగా 3000 మందిని అందుబాటులో ఉంచుకున్నారంట... ఇంత మందితో.. అది మొట్టమొదటి షెడ్యూల్ లోనే ప్రశాంత్ నీల్ ఎలాంటి సీన్స్ షూట్ చేయబోతున్నారనే ఆసక్తికరంగా మారింది. 1950ల నాటి మహారాష్ట్ర సెట్ వేస్తుండటంతో ప్రశాంత్ నీల్ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేయబోతున్నారని అంటున్నారు. మొదటి షెడ్యూల్ అంతా యాక్షన్ పార్ట్ ను షూట్ చేయబోతున్నారంట. ఫస్ట్ షెడ్యూల్ లో ఎన్టీఆర్ మాత్రం జాయిన్ కావడం లేదు. మార్చిలో ప్రారంభమయ్యే రెండో షెడ్యూలో తారక్ సెట్స్ లో అడుగుపెట్టబోతున్నారు. ఇలోగా ఎన్టీఆర్ 'వార్2'లో మిగిలిన షూట్ ను పూర్తి చేసుకోబోతున్నారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











