ప్రభాస్ బర్త్ డే రోజున ఫ్యాన్స్‌కు శుభవార్త.. సలార్ 2 గురించి క్రేజీ న్యూస్
రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన సలార్ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీకి సీక్వెల్‌గా రూపొందించే మూవీపై అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభాస్ జన్మదినం సందర్బంగా రెబల్ స్టార్ అభిమానులకు శుభవార్తను అందించారు. ప్రభాస్ మూవీని ప్రారంభించామని ఆయన బర్త్ డే రోజున అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ వివరాల్లోకి వెళితే..
ప్రభాస్, ప్రశాంత్ నీల్ కలయికలో వచ్చిన సలార్ చిత్రం భారీ బడ్జెట్‌తో రూపొందింది. సుమారుగా ఈ సినిమాను 400 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 6000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా సుమారుగా 610 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది.

అయితే సలార్ మూవీలో ఎన్ని ప్రశ్నలను ప్రేక్షకులకు వదిలిపెట్టారు. దాంతో సలార్ పార్ట్ 2లో ఏం జరుగబోతుందనే విషయం ఆసక్తిగా మారింది. ఎన్నో మలుపులు, ట్విస్టులు ఉండటంతో ఈ మూవీ కోసం అన్ని వర్గాలు వేచి చూస్తున్నాయి. అయితే ఈ మూవీ గురించి ప్రముఖ నిర్మాణ సంస్త హోంబలే అధికారికంగా ప్రకటనను రిలీజ్ చేసింది.
ప్రభాస్ బర్త్ డేను పురస్కరించుకొని.. ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమార్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రానున్న సలార్ 2 సినిమా షూటింగ్ మొదలైంది. ఈ పెద్ద వార్తను ప్రభాస్ అభిమానులకు వెల్లడించడానికి మేము సంతోషిస్తున్నాం. ప్రభాస్ పుట్టిన రోజున ఇది పండగలాంటి వార్తనే అని ప్రకటనను జారీ చేశారు.

సలార్ 2 సినిమా షూటింగ్ సుమారుగా 20 రోజులపాటు కొనసాగుతుంది. ఇందులో శృతిహాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రభాస్ పాల్గొంటారు. కీలక సన్నివేశాలను చిత్రీకరించే పనిలో ఉన్నారు అని తెలిపారు. ఈ సినిమాకు ప్రముఖ నిర్మాత విజయ్ కరంగందూర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2025 సంవత్సరంలో రిలీజ్ అవుతున్నది.


Click it and Unblock the Notifications











