డేంజరస్ లోకేషన్లలో.. రాజశేఖర్ ఫిజికల్‌గా.. ప్రశాంత్ వర్మ షాకింగ్ విషయాలు
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్‌టైనర్ 'కల్కి'. శివానీ, శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ నిర్మించారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించారు. 'అ!' వంటి ప్రయోగాత్మక, కొత్త తరహా చిత్రం తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, కమర్షియల్ ట్రైలర్, 'హార్న్ ఓకే ప్లీజ్', 'ఎవరో ఎవరో' పాటలకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన లభిస్తోంది. ఈ నెల 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా రిలీజ్ రైట్స్ ను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె. రాధామోహన్ సొంతం చేసుకుని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. హైదరాబాద్ లో సోమవారం జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ప్రశాంత్ వర్మ 'కల్కి' హానెస్ట్ ట్రైలర్ విడుదల చేశారు.

ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ ''ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముందే హానెస్ట్ ట్రైలర్ విడుదల చేస్తున్నాం. సినిమా ఎలా ఉంటుందో చెప్పే విధంగా మోషన్ పోస్టర్, టీజర్, కమర్షియల్ ట్రైలర్, ఇప్పుడీ హానెస్ట్ ట్రైలర్ డిజైన్ చేశాం. కమర్షియల్ ట్రైలర్ విడుదలైన తర్వాత చాలామంది 'కల్కి'ని 'గేమ్ ఆఫ్ థ్రోన్స్'తో కంపేర్ చేశారు. సినిమాలో కామెడీ, ఐటమ్ సాంగ్, కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి కమర్షియల్ ట్రైలర్ కట్ చేశాం. సినిమా ఏంటనేది ఈ హానెస్ట్ ట్రైలర్ చెబుతుంది.
1983 నేపథ్యంలో కథ సాగుతుంది. పీరియడ్ సినిమాల కంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందనే కథలతో సినిమాలు తీయడానికి ఇష్టపడే దర్శకుణ్ణి నేను. చాలా రీసెర్చ్ చేసిన తర్వాత 'కల్కి' చేశా. ఇదొక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. దర్శకుడిగా నా తొలి సినిమా 'అ!'తో పోలిస్తే 'కల్కి' చాలా పెద్ద సినిమా. ఎక్కువ లొకేషన్స్‌లో భారీగా తీశాం. డేంజరస్ లొకేషన్స్‌లోనూ షూట్ చేశాం. రాజశేఖర్‌గారు ఫిజికల్‌గా చాలా కష్టపడ్డారు. వంద అడుగుల లొతైన ప్రదేశాల్లో షూటింగ్ చేశారు. సినిమా బ్లాక్‌బస్టర్ అయితేనే సినిమా బడ్జెట్ రాబట్టుకోగలం.
ప్రవీణ్ సత్తారు 'గరుడవేగ' తీసి ఉండకపోతే... 'కల్కి' ఉండేది కాదు. జీవితగారు చాలా సహనంతో చాలా పనుల్ని హ్యాండిల్ చేస్తున్నారు. నాకు, నిర్మాత సి. కల్యాణ్‌కి మధ్య వారధి ఆవిడే. ఈ సినిమా కథ సాయి తేజది. స్ర్కిప్ట్ విల్ స్ర్కీన్‌ప్లే సమకూర్చింది. సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా స్ర్కిప్ట్‌పై వర్క్ చేశాం. సినిమా చూస్తుంటే... తర్వాత ఏం జరుగుతుందోనని ఎవరూ ఊహించలేని విధంగా 'కల్కి' ఉంటుంది. 'కల్కి' క్యారెక్టర్ అందరికీ నచ్చుతుంది. ఈ క్యారెక్టర్‌ని బేస్ చేసుకుని సినిమాలు చేయవచ్చు. ఒక ఫ్రాంచైజీలా. సినిమా చూశాక... అందరూ 'కల్కి 2' కోసం వెయిట్ చేస్తారు. సినిమాలో రెండు పాటలే ఉన్నాయి. నాలుగు థీమ్ సాంగ్స్ ఉన్నాయి. అవి మూడు భాషల్లో ఉంటాయి'' అన్నారు.


Click it and Unblock the Notifications











