HanuMan: ప్రశాంత్ వర్మ బంపర్ ప్లాన్.. హనుమాన్ కోసం లైవ్ వెబ్ సైట్!
జాంబిరెడ్డి సినిమా తర్వాత ప్రశాంత్ వర్మ తేజ సజ్జా కాంబోలో వచ్చిన చిత్రం హనుమాన్. ఇక ఇది తెలుగులో మొదటి సూపర్ హీరో కథాంశంతో తెరకెక్కింది. ఇక ఈ చిత్రం జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అమృత అయ్యార్ హీరోయిన్ గా నటించగా.. విలన్ రాయ్ విలన్ పాత్రలో నటించారు. ఇక తాజాగా ఈ చిత్ర బృందం సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకుంది. ఇందులో ప్రశాంత్ వర్మ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే....
హనుమాన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక మొదటి రోజు దాదాపు 15 కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రతి టికెట్ మీద వచ్చే డబ్బుల్లో రూ. 5 లను రామ మందిర నిర్మాణానికి విరాళంగా ఇవ్వనున్నట్లు తెలిపారు.

అయితే సినిమా విడుదలకు ముందే చెప్పిన మాటను 'హను-మాన్' చిత్ర యూనిట్ నిలబెట్టుకుంది. ప్రీమియర్ షోల ద్వారా వచ్చిన రూ.14.25 లక్షలను అయోధ్య రామ మందిర నిర్మాణానికి విరాళంగా ఇస్తున్నట్లు వెల్లడించింది. ఈ సినిమా ప్రదర్శితమైనంత కాలం విరాళం ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. ఇక ఈ నేపథ్యంలోనే ఈ సినిమా బృందం కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ సినిమా తాజాగా సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ఇందులో హీరో తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ, నిర్మాత నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సినిమా కోసం లైవ్ వెబ్ సైట్ క్రియేట్ చేస్తున్నట్లు తెలిపారు. వెబ్ సైట్ రూపొందించి సంబంధిత వివరాలు అందులో పొందుపరుస్తామని నిర్మాత నిరంజన్‌రెడ్డి ప్రకటించారు. హనుమాన్ చిత్రం టికెట్ మీద ప్రతి 5 రూపాయలను రామ మందిర నిర్మాణానికి విరాళంగా ఇస్తున్నట్లు ఇప్పటికే తెలిపారు.

ఇక ఇప్పుడు తాజాగా ఈ విషయంపై ప్రశాంత్ వర్మ మట్లాడుతూ... ఒకనొక టైం తర్వాత టికెట్ డబ్బులు మేమే తీసుకుంటున్నాం అని భావించే అవకాశం ఉంది. అందుకోసమే ఓ లైవ్ వెబ్ సైట్ ఏర్పాటు చేయనున్నాం. ఈ లైవ్ వెబ్ సైట్లో.. టికెట్ ఎక్కడ కొన్నా సరే.. కౌంట్ అందులో పడుతుంది. ట్రాన్స్పెరెంటుగా ఎంత డోనేట్ చేస్తున్నామో అందులో కనిపిస్తుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా హనుమాన్ సినిమాను ఎంత మంది చూశారు.. ఎంత కలెక్షన్స్ వచ్చాయి అనేది స్పష్టంగా కనిపిస్తుందంటూ వెల్లడించారు. ఇక ప్రశాంత్ వర్మ నిర్ణయంపై పలువురు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇక ఈ సినిమా విషయానికి వస్తే... 'హను-మాన్' సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకొచ్చింది. హిట్ టాక్ సొంతం చేసుకుని దూసుకుపోతుంది. అమృత అయ్యర్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో.... వరలక్ష్మీ శరత్ కుమార్, వినయ్ రాయ్ కీలక పాత్రల్లో నటించారు. కోటి అనే వానర పాత్రకు ప్రముఖ హీరో రవితేజ వాయిస్ ఓవర్ అందించారు. అంజనాద్రి అనే కల్పిత ప్రాంతం చుట్టూ అల్లుకున్న కథగా ఈ సినిమాను రూపొందించారు.


Click it and Unblock the Notifications











